నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతోన్న ఫ్యాక్షన్ సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie). సంక్రాంతి బరిలో దిగడమే లక్ష్యంగా చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. దాదాపుగా పూర్తి కావచ్చని సమాచారం.
 
ఆఖరి పాటకు వేళాయె!
'వీర సింహా రెడ్డి'లో బాలకృష్ణకు జంటగా కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Hassan) నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో హీరోయిన్ల మీద ఈ వారం లాస్ట్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ 18 నుంచి 'వీర సింహా రెడ్డి'కి శృతి హాసన్ డేట్స్ కేటాయించారట. అప్పటి నుంచి లాస్ట్ షూటింగ్ చేయనున్నారని తెలిసింది. ఆల్రెడీ టర్కీలో జరిగిన వన్ మంత్ లాంగ్ షెడ్యూల్‌లో బాలకృష్ణ, శృతిపై కొన్ని సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా తీశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో తీయబోయే పాటతో హీరో హీరోయిన్ల సీన్లు కంప్లీట్ అవుతాయని టాక్. 


అనంతపురంలో 'వీర సింహా రెడ్డి' షూటింగ్!
ఫ్యాక్షన్ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఫ్యాక్షన్ అంటే ప్రేక్షకులకు, ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది రాయలసీమ. ఇప్పుడు ఆ సీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్న కన్నడ నటుడు దునియా విజయ్, ఇతరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.  


Also Read : కృష్ణకు కడసారి వీడ్కోలు - తీవ్ర భావోద్వేగానికి గురైన మహేష్ బాబు, అభిమానులు కన్నీళ్లు






వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఫైట్!
ఆ మధ్య 'వీర సింహా రెడ్డి' కోసం బాలకృష్ణ, విలన్స్ బ్యాచ్ మీద హైదరాబాద్‌లో భారీ ఫైట్ తీశారు. సినిమాలో కీలక సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని, గూస్ బంప్స్ ఇచ్చేలా, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఉంటుందని తెలిసింది. గోపీచంద్ మలినేని ఆ ఫైట్ స్పెషల్‌గా ఉండేలా డిజైన్ చేశారట.    


వాస్తవ ఘటనల ఆధారంగా 'వీర సింహా రెడ్డి'
ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ. 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అలాగే, 'సింహా' టైటిల్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 'వీర సింహా రెడ్డి'లో కూడా సింహా ఉంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. టైటిల్ సెంటిమెంట్ మాత్రమే కాదు... సినిమాలో అద్భుతమైన కంటెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.  


హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.