నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటించిన సినిమా ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాకు గోపి చంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకొని సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది మూవీ టీమ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలతో సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ సినిమాతో మరో సారి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపడానికి సిద్దమౌవుతున్నాడు బాలయ్య. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 6వ తేదీన ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.
ఒంగోలు నేపథ్యంలోనే ‘వీర సింహారెడ్డి’ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని చూస్తోందట చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్ ను గ్రాండ్ గా చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6న సాయంత్రం 6 గంటల నుంచి ఒంగోలులోని ఏఎంబీ కాలేజీ గ్రౌండ్స్ లో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది చిత్ర యూనిట్. దీంతో ప్రీ రిలీజ్ వేడుకకు చేరుకునే ప్రతి మార్గంలో భారీ ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు బాలయ్య అభిమానులు.
మరోవైపు ‘వీర సింహారెడ్డి’ మూవీ ట్రైలర్ కోసం బాలయ్య అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జనవరి 6న ఒంగోలు లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు అనే దానిపై మాత్రం మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సినిమా ట్రైలర్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో చేసన ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ‘ఇప్పుడే వీర సింహారెడ్డి ట్రైలర్ చూశా.. రచ్చ రచ్చే జనవరి 6న ఫైర్ ఫైర్ ఫైర్ జై బాలయ్య’ అంటూ సినిమా పై భారీ అంచనాలే పెంచేశాడు థమన్.
ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో మూవీ సాగనున్నట్లు తెలస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’, ‘కళ్యాణం కమనీయం’ వంటి సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో సంక్రాంతి పండగ విన్నర్ గా ఎవరు నిలబడతారో వేచి చూడాలి.
Also Read: ఇళ్లు కావు ఇంద్ర భవనాలు - 2022లో ఈ సెలబ్రిటీలు కొన్న బంగ్లాల ధరలు తెలిస్తే జ్వరమొస్తాది!