డబుల్ ధమాకా.. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... అన్నట్టు 'అన్‌స్టాపబుల్ 2' స్టార్టింగ్ మూడు ఎపిసోడ్స్ నడిచాయి. ఇప్పుడు డబుల్ కాదు... ట్రిపుల్ ధమాకా ఇవ్వడానికి నట సింహం నందమూరి బాలకృష్ణ, ఆహా రెడీ అయ్యాయి. నాలుగో ఎపిసోడ్‌లో ముగ్గురు సందడి చేయనున్నారు.  


రాజకీయ నాయకులతో రాధిక!
'అన్‌స్టాప‌బుల్‌ 2' కొత్త ఎపిసోడ్ ఎప్పుడు? ఎప్పుడు? ఈ గురువారం రాలేదేంటి? ఇక రాదా? వంటి ప్రశ్నలకు రాధికా శరత్ కుమార్ సెల్ఫీతో 'ఆహా' టీమ్ చెక్ పెట్టింది. నిజాం కాలేజీలో తనకు స్నేహితులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్, మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారని, వాళ్ళిద్దరూ కొత్త ఎపిసోడ్‌కు అతిథులుగా వస్తున్నారని కొన్ని రోజుల నుంచి వినబడుతోంది. అది నిజమని రాధిక సెల్ఫీతో తెలిసింది. అయితే... కిరణ్ కుమార్, సురేష్ రెడ్డితో పాటు ఆమె కూడా ఆ ఎపిసోడ్‌లో జాయిన్ అయ్యారు.
 





ఇప్పుడు 'అన్‌స్టాప‌బుల్‌ 2' నాలుగో ఎపిసోడ్ మీద  మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. రాజకీయ నాయకులు ఇద్దరూ బాలకృష్ణకు స్నేహితులు. కాలేజీ నుంచి రాజకీయాల వరకు వీక్షకులకు తెలియని ఎన్నో అంశాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళతో పాటు రాధిక ఏం మాట్లాడారు? అనే ఆసక్తి మొదలైంది. త్వరలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మ్యాగ్జిమమ్... వచ్చే గురువారం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 


Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?


ఆల్రెడీ 'అన్‌స్టాప‌బుల్‌' సెకండ్ సీజన్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రికార్డుల పరంపర వెండితెరపై మాత్రమే కాదు... డిజిటల్ తెరపై కూడా కంటిన్యూ అవుతోంది. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.  


'అన్‌స్టాప‌బుల్‌  విత్ ఎన్‌బీకే 2' ఫస్ట్ ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ వెల్లడించింది. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన ఎపిసోడ్ రాజకీయ, సినిమా వర్గాలు వీక్షించాయి. యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ఎపిసోడ్ బావుందనే పేరు వచ్చింది. శర్వానంద్, అడివి శేష్ ఎపిసోడ్ అయితే అందరినీ ఎంటర్‌టైన్ చేసింది.