'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరో నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా 'అంటే సుందరానికీ' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన 'దసరా' అనే మరో సినిమాలో నటిస్తున్నారు.  శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు నాని. 


ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్ ను విడుదల చేస్తూ చిన్న వీడియోను వదిలారు. అందులో నాని లుంగీ కట్టుకొని ఊరమాస్ గెటప్ లో కనిపించారు. తల నుంచి రక్తం కారుతుండగా.. అలా బొగ్గు గనుల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తూ.. మంటల్లో నుంచి చేతులు తీసి సిగరెట్ అంటించుకున్నాడు. అక్కడి గ్రామస్తులంతా అతడి వెనుక నడుస్తూ కనిపించారు. ఈ టెరిఫిక్ వీడియో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. నాని ట్రాన్ఫర్మేషన్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది మరి.. సినిమా ఎలా ఉంటుందో..!


ఈ వీడియోను షేర్ చేసిన నాని.. ఇందులో ఆయన ధరణి అని క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌, నవీన్ నూలి ఎడిటర్‌.