మహేష్ బాబు కొడుకు గౌతమ్ తన హైస్కూల్‌లో చేసిన మొదటి థియేటర్ పెర్ఫార్మెన్స్ వీడియోను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు వారసుడు రెడీ అయిపోయాడంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’ సినిమాలో గౌతం మొదటిసారి తెర మీద కనిపించాడు. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా గౌతం నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత గౌతం పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టారు. హైస్కూల్ కోసం గౌతంను మహేష్ బాబు లండన్‌లో జాయిన్ చేశారు. చదువుతో పాటు హీరో అవ్వడంపైన కూడా గౌతం దృష్టి పెట్టాడని ఈ వీడియోను చూస్తే తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా థమన్‌ను మొదట ప్రకటించగా, ఇప్పుడు తన స్థానంలో అనిరుథ్‌ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
సంగీత దర్శకుడిగా థమన్ వద్దని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు చిత్రసీమ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఎందుకు? అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. మహేష్ లాస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'లో సంగీతం పట్ల ఘట్టమనేని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. మహేష్ మాత్రం ఓసారి స్టేజిపైకి వెళ్లి మరీ స్టెప్ వేశారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు థమన్ సంగీతానికి ఓకే చెప్పి, ఇప్పుడు వద్దని అనడం ఏమిటనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది.
ఇప్పటికే ట్యూన్స్ కంప్లీట్ చేసిన థమన్!
మహేష్ బాబు దుబాయ్‌లో ఉన్నప్పుడు ఆయనను కలవడానికి త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు థమన్ కూడా వెళ్ళారు. తిరిగి వచ్చిన రెండు మూడు వారాలకు మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రెండు ట్యూన్స్ కూడా కంప్లీట్ చేశారని టాక్. కృష్ణ మరణంతో ప్రస్తుతం సినిమా వర్క్స్ మీద మహేష్ కాన్సంట్రేషన్ చేయడం లేదు. ఆయన మళ్ళీ రెగ్యులర్ సినిమా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది.
థమన్ బదులు అనిరుధ్ వస్తాడా?
థమన్ బదులు అనిరుధ్‌ను తీసుకుంటారని ఒక టాక్. నిజం చెప్పాలంటే... ఇంతకు ముందు అతడి సినిమా ఒక థమన్ దగ్గరకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ చేసిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రానికి అనిరుధ్‌ను తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత అతడిని కాదని థమన్ చేత సాంగ్స్, రీ రికార్డింగ్ చేయించారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చేసిన 'అజ్ఞాతవాసి' చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.
కృష్ణ మరణంతో షూటింగ్‌కు బ్రేక్!
ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా హీరోగా ఆయనకు 28వ సినిమా (SSMB 28). ఆల్రెడీ ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు. మొన్న ఫ్యామిలీతో కలిసి మహేష్ లండన్ వెళ్లి వచ్చిన తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. నవంబర్ నెలాఖరున లేదంటే డిసెంబర్ తొలి వారంలో షూటింగ్ పునః ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు కృష్ణ మరణంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.