Namo Telugu Movie: నమో అంటే ప్రజలకు గుర్తుకు వచ్చే ఏకైక పేరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi). అభిమానులు ఆయనను ముద్దుగా 'నమో నమో' అంటుంటారు. ఇప్పుడు 'నమో' పేరుతో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. 


సర్వైవల్ కామెడీ సినిమా 'నమో'
'జెర్సీ'లో ప్రత్యేక పాత్రలో నటించిన విశ్వంత్ దుద్దంపూడి (Viswant Duddumpudi) గుర్తు ఉన్నారా? హీరో నాని కుమారుడిగా (పెద్దైన తర్వాత) కనిపించారు. 'ఓ పిట్టకథ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'కథ వెనుక కథ' సినిమాల్లో హీరోగా నటించారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు.


విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా రూపొందుతున్న సినిమా 'నమో'. ఇందులో విస్మయ హీరోయిన్‌. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై ఎ. ప్రశాంత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమంలో శనివారం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 


''నమో అనే పేరు వినగానే ప్రధాన నరేంద్ర మోదీ గారి మీద కథ సిద్ధం చేశారని అనుకున్నా. నగేష్, మోహన్ హీరోల పాత్రల పేర్ల మీద టైటిల్ పెట్టామని దర్శకుడు ఆదిత్య చెప్పారు'' అని పోస్టర్ విడుదల చేసిన తర్వాత భీమనేని శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఆదిత్య నా దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన చాలా సిన్సియర్‌ పర్సన్. రెండు మూడేళ్లు నా దగ్గర ఉన్నారు. ఎంతో అకింత భావంతో పని చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అతను వచ్చి 8 ఏళ్ళు అవుతోంది. ఏదో చేయాలని, నేర్చుకోవాలన్న తపన ఆయనలో ఉంది. ఈ సినిమాతో ఆయన పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.


Also Readహిందీ సినిమాలు 4, తమిళ సినిమాలు 2... తెలుగు నుంచి ఒక్కటీ లేదు - 2023లో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్



ఆదిత్య రెడ్డి కుందూరు మాట్లాడుతూ... ''ఈ రోజు మా కోసం వచ్చిన నా గురువు భీమనేని శ్రీనివాసరావు గారికి థాంక్స్. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నా. నా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన మా హీరో విశ్వంత్‌, హీరోయిన్ విస్మయకు థాంక్స్. మా సినిమా చాలా బాగా వచ్చింది. హాయిగా నవ్వుకునేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. చిన్నా పెద్దా తేడాలు లేకుండా వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారని, సర్వైవల్ కామెడీ జానర్‌ సినిమా 'నమో'ను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


Also Readఒక్కటే క్యారెక్టర్... రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా? 2023లో శ్రీలీల హిట్స్ & ఫ్లాప్స్!


''ఇదొక డిఫరెంట్ సినిమా. దర్శకుడు ఆదిత్య స్పీడుగా సినిమాను పూర్తి చేశారు. ఈ 'నమో'ను మున్ముందు సిరీస్‌ ఆఫ్ సినిమాలు కూడా తీయొచ్చు'' అని హీరో విశ్వంత్ దుద్దంపూడి అన్నారు. ''మా సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. విశ్వంత్ చాలా బాగా నటించారు. అనురూప్ పాత్ర బాగుంటుంది'' అని విస్మయ అన్నారు.