Nagarjuna Akkineni: టాలీవుడ్ స్టార్ హీరోల్లో నాగార్జున ఒకరు. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. రీసెంట్ నాగార్జున గురించి ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. ఆయన ఇటీవల ఓ కొత్త ఎలక్ట్రిక్ కార్ ను కొనుగోలు చేశారు. అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటైన కియా వి6 కార్ ను తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను కార్ డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాగార్జున ఆయన సతీమణి కొత్త కారును డెలివరీ తీసుకుంటున్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. దీంతో ఈ కార్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నాగార్జున తీసుకున్న ఆ కొత్త ఎలక్ట్రిక్ కార్ ధర, ఫీచర్స్ ఏంటీ అని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. 


కియా వి6 అదిరిపోయే ఫీచర్స్ ఇవే!


మన దేశంలో కియా మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా కియా వి6 ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ కియా ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా నాగార్జున కూడా ఈ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ కార్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కార్ డిజైన్ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌ లైట్‌ లతో ఫ్రేమ్‌ లెస్ విండోస్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దాని స్ట్రీమ్‌ లైన్డ్ లుక్‌ ఆకట్టుకుంటుంది. బ్యాక్‌ సైడ్ మోడరన్ లుక్‌లో కనిపిస్తుంది. ఇక కార్ ఇన్నర్ డీటెయిల్స్ చూస్తే.. బ్లాక్ స్వెడ్ సీట్స్, వేగన్ లెదర్ యాక్సెంట్‌లతో ఆల్-బ్లాక్ డిజైన్‌ తో ఉంది. వైర్‌లెస్ ఛార్జర్, డిఫరెంట్ డ్రైవ్ మోడ్‌లు, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, మెమరీ ఫంక్షన్‌తో 10-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు అమర్చబడి ఉంది. రిజనరేటివ్ బ్రేకింగ్, కనెక్టెడ్ కారు క్యాపబులిటీస్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్‌, డ్యూయల్ 12.3-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌ లు, షిఫ్ట్ బై వైర్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌ ల కోసం ప్యాడిల్ షిఫ్టర్‌లు ఈ కారులో ఉన్నాయి.


3.5 సెకన్లలో 100 స్పీడ్..


కియా వి6 ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ విషయనికొస్తే.. 77.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ తో 528 కిలోమీటర్లు డ్రైవింగ్ లిమిట్ తో ఈ కార్ డిజైన్ చేయబడింది. బ్యాటరీ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ వెహికిల్ కేవలం 4.5 నిమిషాల్లో 100 కిలోమీటర్ల వరకు ఛార్జింగ్ అవుతుంది. 350 kW ఫాస్ట్ ఛార్జర్‌ తో 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. RWD సింగిల్ మోటార్ యూనిట్ 350 Nm, 225 Bhp పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అత్యుత్తమ ఫీచర్లు కలిగిన ఈ కార్ 0 నుంచి 100 స్పీడ్ అందుకోవడానికి కేవలం 3.5 సెకన్లు మాత్రమే తీసుకుంటుంది. ఇక ఈ కార్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.60.95 లక్షలుగా ఉంది. ఇలాంటి కార్ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రెటీల దగ్గర కూడా ఉంది. ఇప్పుడు నాగార్జున కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ ను కొనుగోలు చేసిన సెలబ్రెటీల లిస్ట్ లో చేరిపోయారు. 


ఈ కార్ ఇంకా ఎవరెవరి దగ్గర ఉందంటే..


కియా వి6 కార్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే చాలా మంది సెలబ్రెటీలు ఈ కార్ ను సొంతం కొనుగోలు చేస్తున్నారు. క్రికెటర్ మహేంద్ర సింగ్ దోని దగ్గర కూడా కియా వి6 శాటిన్ సిల్వర్ షేడ్ కార్ ఉంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్ లు కూడా ఈ కియా వి6 ను నడుపుతూ కనిపించారు. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూడా సరికొత్త కియా EV6 డెలివరీ తీసుకున్నారు. మెహన్ లాల్ కు ఈ కార్ బహుమతిగా వచ్చింది అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా కియా ఎలక్ట్రిక్ కార్ కొన్ని యజమానుల లిస్ట్ లోకి కింగ్ నాగార్జున కూడా చేరిపోయారు.  


Also Read: ‘బక్రీద్’ నేపథ్యంలో రష్మీ వివాదాస్పద ట్వీట్ - మండిపడుతోన్న నెటిజన్స్