Rangabali Movie: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా సక్సెస్ అవుతుందో చెప్పలేం. ఓక్కోసారి కొన్ని సినిమాల్లో కంటెంట్ ఉన్నా అవి సరైన ప్రచారం చేయకపోవడంతో ప్రేక్షకాదరణ పొందలేకపోతాయి. అందుకే ఈరోజుల్లో ప్రతీ మూవీ మేకర్స్ తాము తీసిన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రమోషన్స్ ను చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ ను చాలా వెరైటీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు మేకర్స్. రీసెంట్ గా నాగశౌర్య హీరోగా వచ్చిన ‘రంగబలి’ సినిమాకు కూడా అలాంటి వినూత్న ప్రచార కార్యక్రమాలను చేశారు మూవీ టీమ్. అందులో భాగంగానే కమెడియన్ సత్యతో కలసి ఓ ఇంటర్వ్యూ చేశారు హీరో నాగశౌర్య. ఆ ఇంటర్వ్యూలో కొంత మంది ప్రముఖ జర్నలిస్ట్ లను ఇమిటేట్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ మొదటి పార్ట్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.


ఎట్టకేలకు ఇంటర్వ్యూను రిలీజ్ చేసిన ‘రంగబలి’ టీమ్..


‘రంగబలి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ వినూత్న ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది మూవీ టీమ్. కమెడియన్ సత్యతో కలసి హీరో నాగశౌర్య చేసిన ఆ వివాదాస్పద ఇంటర్వ్యూ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఇందులో కమెడియన్ సత్య నాగశౌర్యను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. ఓ ప్రముఖ చానల్ వచ్చే కార్యక్రమాన్ని ‘ఓపెన్ హార్ట్ విత్ సత్య’ పేరుతో ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హీరో నాగశౌర్య ను పలు విచిత్ర ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేశారు సత్య. ఈ ప్రశ్నలన్నీ కాంట్రవర్సీగా ఉంటూనే ఫన్ ను క్రియేట్ చేశాయి. అలాగే తర్వాత ‘ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ దేవి ప్రియ’ పేరుతో మరో జర్నలిస్ట్ లా గెటెప్ వేసుకొని నాగశౌర్యను ఇంటర్య్వూ చేశారు సత్య. ఇది కూడా చాలా సెటైరికల్ గా ఫన్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సెకండ్ పార్ట్ ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. 


ఒత్తిడికి లొంగకుండా.. ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గకుండా..


‘రంగబలి’ మూవీ టీమ్ ప్రమోషన్స్ పై చాలా ఇంట్రస్టింగ్ గా వర్క్ చేస్తుంది. మూవీ ప్రమోషన్స్ టీమ్ ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఈ మూవీ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడం అలాగే ప్రమోషన్స్ వీడియోలు బాగా వైరల్ అవడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే ప్రమోషన్స్ లో భాగంగా కమెడియన్ సత్య వివిధ గెటప్ లలో చేసిన ఇంటర్వ్యూ మాత్రం వివాదాస్పదంగా మారింది. ఇందులో ప్రముఖ జర్నలిస్ట్ లను కించపరిచేలా చేశారని, ఆ ఇంటర్వ్యూను నిలిపి వేయాలని మూవీ టీమ్ పై ఒత్తిడి కూడా వచ్చింది. దీంతో ఈ ఇంటర్య్వూను నిలిపేస్తారని అనుకున్నారంతా. అయితే ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా ఆ ఇంటర్వ్యూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పాటల రచయిత అనంత శ్రీరామ్ తో ఇలాగే ఓ వైరల్ వీడియో ప్లాన్ చేశారు. అయితే అది అంతగా ప్రభావం చూపలేదు. కానీ సత్య ఇంటర్వ్యూ మాత్రం మూవీ పై ఫుల్ హైప్ తీసుకొచ్చింది. మరి తెరపై మూవీలో ఎలాంటి కామెడీ ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తుండగా యుక్తి తరేజా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: దళపతి విజయ్ షాకింగ్ నిర్ణయం, సినిమాలకు మూడేళ్లు బ్రేక్? కారణం అదేనా?