యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) ప్రధాన పాత్రలో నటిసోన్న లేటెస్ట్ చిత్రం 'రంగబలి'. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 7వ తేదీన రిలీజ్ (Rangabali Movie Release Date ) చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.


'రంగబలి' సినిమాను విభిన్నమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి ఉన్న శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో రంగబలి ఫన్ రైడ్‌గా ఉండబోతోందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా.. ఈ మూవీ టైటిల్ ను ఇటీవలే ప్రకటించారు. అత్యంత వైభవంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 7న థియేటర్లలో విడుదలనున్నట్టుగా మేకర్స్ తెలియజేశారు. దాంతో పాటు ట్రెండీ గెటప్‌లో కనిపిసోన్న నాగశౌర్య పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాగశౌర్య రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్టుగా ఉంది. ప్లెజెంట్ మూడ్ ను తెప్పించేలా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ సినిమాకు దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందించగా.. పవన్ సిహెచ్ సంగీత దర్శకుడిగా నిర్వహించనున్నారు. గతేడాది ఆగష్టులో ఈ సినిమా ప్రారంభం కాగా.. ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో పలు షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 'రంగబలి' సినిమాలో నాగశౌర్యకు జంటగా యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య 'లవ్ స్టోరీ'కి అద్భుతమైన ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. 


Also Read : పాతబస్తీలో పోలీసుగా పవన్ కళ్యాణ్, పెర్ఫార్మన్స్ బద్దలే - 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ వచ్చేసింది






 


2011లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన హీరో నాగశౌర్య..  "క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్" అనే సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్య' లాంటి చిత్రాలలోనూ నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. నాగశౌర్య కేవలం నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా, కథా రచయితగానూ వ్యవహరించారు. కథలో రాజకుమారి సినిమా ఓ అతిథి పాత్రలోనూ ఆయన మెప్పించారు. 2018లో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన 'ఛలో' మూవీతో సహ నిర్మాతగా మారారు నాగశౌర్య. ఈ మూవీ ద్వారానే నటి రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత 'అశ్వథామ'కు సహ నిర్మాత, కథా రచయితగానూ పని చేశారు. మధ్యలో సమంత లీడ్ రోల్ లో నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఇటీవలే 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'లో నటించిన ఆయన.. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. కాగా నాగ శౌర్యకు ‘రంగబలి’ సినిమా 23వ సినిమా కావడం విశేషం.


Also Read మహేష్ సినిమా టైటిల్ అదేనా? సెంటిమెంట్ కంటిన్యూ చేసిన త్రివిక్రమ్