ఉగాది సందర్భంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు వారి కొత్త సంవత్సరం నాడు సినీ లవర్స్ ను అలరించబోతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కానుండగా, మరికొన్ని ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
‘దాస్ కా ధమ్కీ’- మార్చి 22న విడుదల
యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, నివేదా పేతురాజ్ హీరోయిన్ గా కలిసిన నటించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. యాక్షన్ కామెడీ చిత్రంగా ఈ సినిమా రూపొందింది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. నటుడిగా మాత్రమే కాదు, ఒక మంచి దర్శకుడిగా కూడా విశ్వక్ సేన్ ‘ఫలక్ నూమా దాస్’ చిత్రంతో నిరూపించుకున్నాడు. తాజాగా ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మరోసారి హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మాస్ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘రంగమార్తాండ’- మార్చి 22న విడుదల
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ చాలాకాలం తర్వాత ‘రంగమార్తాండ’ సినిమా చేస్తున్నారు. చాలా కాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రీమియర్స్ ను చూసిన జనాలు సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ కృష్ణవంశీ ఈ సినిమా తీశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్రలోరమ్యకృష్ణ కనిపించనుంది. రంగస్థల కళాకారుల జీవితాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటించారు.
‘కోస్టి’- ఈ నెల 22న విడుదల
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ‘ఘోస్టి’ సినిమా తెలుగులో ‘కోస్టి’ పేరుతో రిలీజ్ అవుతోంది. హారర్ కామెడీ కథాశంతో రూపొందిన ఈ సినిమాలో యోగిబాబు, ఊర్వశి తదితరులు నటించారు. ఈ నెల 17న తమిళంలో విడుదలైన ‘ఘోస్టి’.. ఉగాది కానుకగా ‘కోస్టి’ పేరుతో గంగ ఎంటర్‌టైన్ మెంట్స్ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తోంది. ఇందులో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు థ్రిల్ అంశాలు ఉన్నాయట. ఇన్ స్పెక్టర్ హారతి పాత్రలో కాజల్ నటించి ఆకట్టుకుందట.
గీత సాక్షిగా - మార్చి 22
యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. చిత్ర నిర్మాత చేతన్ రాజ్ దర్శకుడు కాగా ఆంథోని మట్టిపల్లి నిర్మాతగా వ్యవహరించారు.
ఓటీటీల్లో విడుదలకానున్న సినిమాలు
ఆహా
⦿ వినరో భాగ్యము విష్ణుకథ
నెట్‌ఫ్లిక్స్
⦿ అమెరికన్ అపోకలిప్స్ (ఇంగ్లిష్)
⦿ జానీ (ఇంగ్లిష్)
Read Also: బాలీవుడ్ అంటే ఏమిటి? హిందీ చిత్ర పరిశ్రమకు ఆ పేరు రావడానికి కారణం అదేనా?