నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘మనీ హైస్ట్’ వెబ్ సీరిస్‌కు ఎంత ప్రేక్షకాధరణ ఉందో తెలిసిందే. మొదటి సీజన్ నుంచి చివరి సీజన్ వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ సీరిస్‌‌ ఎట్టకేలకు ముగిసింది. అయితే, ప్రేక్షకులు మాత్రం ఆ ఫీవర్ నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఇండియాలో ఈ వెబ్‌ సీరిస్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మనీ హైస్ట్’లోని తారాగణం కూడా భారతీయుల అభిమానానికి ఫిదా అయ్యారు. ‘నెట్ ఫ్లిక్స్’ కూడా ఈ అభిమానాన్ని సొమ్ము చేసుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌తోపాటు ముంబయి, ఢిల్లీ నగరాల్లో మనీ హైస్ట్ పాత్రదారుల భారీ ‘స్ట్రీట్ ఆర్ట్స్’తో ప్రచారం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా నగరంలోని నక్లెస్ రోడ్, అమీర్ పేట్‌లోని భవనాలపై ‘మనీ హైస్ట్’ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఆ చిత్రాలను చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు. 


అత్యధిక ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘మనీ హైస్ట్’లో ఇప్పటికే ఒక సీజన్ (వాల్యూమ్ 1) విజయవంతంగా ముగిసింది. వాల్యూమ్ 2లో పార్ట్ 4 వరకు మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. ఉత్కంఠభరిత క్లైమాక్స్ సీన్లు కలిగిన పార్ట్ 5 ఎపిసోడ్స్‌ డిసెంబరు 3 నుంచి స్ట్రీమ్ అవుతున్నాయి. ఊహకు అందని ట్విస్టులతో.. థ్రిలింగ్ సీన్స్‌తో క్లైమాక్స్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సీరిస్‌కు ఇండియాలో లభిస్తున్న ఆధరణ దృష్టిలో పెట్టుకుని తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో కూడా ఈ సీరిస్‌ను విడుదల చేశారు. ఈ సీరిస్‌లోని ప్రొఫెసర్, టోక్యో, బెర్లిన్, నైరోబీ, డెన్వర్ పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.


హైదరాబాద్‌లోని ‘మనీ హైస్ట్’ స్ట్రీట్ ఆర్ట్‌ను ఈ వీడియోలో చూడండి: 







Also Read: మనీ హెయిస్ట్ రివ్యూ: ఎండింగ్ ఇరగదీశారు.. మొదలెడితే ఆపడం కష్టమే!