Mohan Babu Surrendered two guns : లైసెన్సుడ్ గన్స్ ను సరెండర్ చేయకపోతే వారంట్ జారీ చేసి అరెస్టు చేస్తామని రాచకొండ సీపీ హెచ్చరికలు జారీ చేయడంతో మంచు మోహన్ బాబు దిగి వచ్చారు. వెంటనే తన వద్ద ఉన్న రెండు గన్స్ లో ఒక దాన్ని చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశారు. ఆ గన్ లైసెన్స్ అక్కడే తీసుకున్నారు. మరో గన్ ను ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరెండర్ చేశారు. ఆ గన్ లైసెన్స్ అక్కడే తీసుకున్నారు. మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సమస్యసల కారణంగా ఇరువులు కుమారులు గొడవలు పడుతున్నారు. బౌన్సర్లతో రచ్చ చేసుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. మోహన్ బాబు కూడా ఆవేశంగా మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. 


ఈ క్రమంలో ఆయన గన్ లను సరెండర్ చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించినప్పటికీ ఆయన కోర్టుకు వెళ్లి  ఇరవై నాలుగో తేదీ వరకూ హాజరు కాకుండా స్టే తెచ్చుకున్నారు. ఇరవై నాలుగో తేదీన కోర్టు నోటీసుల్ని కొట్టి వేయాలా కోర్టు ముందు హాజరు కావాలా అన్నది నిర్ణయిస్తుంది. నిజానికి ఆ నోటీసులు జారీ చేసినప్పుడు జర్నలిస్టుపై దాడి కేసు నమోదు అయింది. అయితే తర్వాత దాన్ని హత్యాయత్నం కేసుగా మార్చారు. దీంతో మోహన్ బాబు చిక్కుల్లో పడినట్లయింది. 


అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన రోజున ఆయన ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన పోలీసులకు కూడా అందుబాటులో లేరు. దీంతో పరారయ్యారని అందరూ అనుకున్నారు. కానీ తను పరారు కాలేదని మెడికేషన్ లో ఉన్నానని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. గన్స్ సరెండర్ చేయడానికి కూడా మోహన్ బాబు ఆలస్యం చేస్తూండటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. దీంతో తప్పని పరిస్థితుల్లో గన్స్ సరెండర్ చేశారు. 


మరో వైపు మోహన్ బాబు తాను దాడి చేసిన ఓ టీవీ చానల్ రిపోర్టర్ ను ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో పరామర్శించారు. ఆవేశంలో దాడి చేశానని క్షమించమని కోరారు. ఆయన కుటుంబసభ్యులను కూడా కలిశారు. దీంతో రాజీ చేసుకునేందుకు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గన్స్ సరెండర్ చేయడంతో మోహన్ బాబును ఇరవై నాలుగో తేదీ వరకూ పోలీసులు ప్రశ్నించే అవకాశం లేదని  భావిస్తున్నారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయాన్ని బట్టి మోహన్ బాబుకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. 


ఓ వైపు కుటుంబంలో సమస్యలు పెరిగిపోతున్నాయి. మంచు విష్ణు, మనోజ్ రోజు ఏదో విధంగా గొడవపడుతున్నారు. అవి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్తున్నాయి. మరో వైపు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఈ చిక్కుల్లో మోహన్ బాబు ఒత్తిడికి గురవుతున్నారు. 



Also Read: President Droupadi Murmu: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - ఈ నెల 21 వరకూ భాగ్యనగరంలోనే..