'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకి ముఞ్చి అవకాశాలే వచ్చాయి. కానీ సరైన హిట్స్ పడకపోవడంతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. 'ఎఫ్2' సినిమా మినహాయిస్తే.. గత నాలుగేళ్లలో ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేకపోయింది. ఇప్పుడు 'ఎఫ్2'కి కొనసాగింపుగా వస్తోన్న 'ఎఫ్3' సినిమాపై తన ఆశలన్నీ పెట్టుకుంది.
ఇందులో మెహ్రీన్ తో పాటు తమన్నా, సోనాల్ చౌహాన్, పూజాహెగ్డే లాంటి హీరోయిన్లు కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకోబోతున్నారు. ఇదిలా ఉండగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెహ్రీన్ ఎప్పుడో మిస్ అయిన ఓ సినిమా గురించి చెప్పుకొని బాధపడుతోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' తరువాత తనకు మంచి అవకాశాలు వచ్చాయని.. అందులో 'సరైనోడు' సినిమా ఒకటని మెహ్రీన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఆ సినిమాలో హీరోయిన్ గా ముందు తననే సంప్రదించారని.. కానీ కొన్ని కారణాల వలన సినిమా చేయలేకపోయానని.. ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్ వేరేలా ఉండేదని మెహ్రీన్ వాపోయింది. ఈ సినిమా మిస్ అవ్వడంతో తను చాలా బాధపడినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తన క్రష్ అండ్ కాలేజ్ లవ్ ఎఫైర్స్ గురించి మాట్లాడింది.
యంగేజ్ లో ఉన్నప్పుడు సల్మాన్ పై విపరీతమైన క్రష్ ఉండేదని.. అతడంటే పిచ్చి అని చెప్పింది. ఇద్దరికి పెద్దగా ఏజ్ డిఫరెన్స్ లేకపోతే కచ్చితంగా వెళ్లి పెళ్లి చేసుకుంటారా..? అని అడిగేదాన్ని అని తెలిపింది. ఇక కాలేజ్ డేస్ లో చాలా మంది అబ్బాయిలు తనను ఇష్టపడ్డా.. ఎవరూ ప్రపోజ్ చేయలేదని.. తాను అప్పట్లో ఫైర్ బ్రాండ్ లా ఉండడంతో ఎవరూ దగ్గరకు వచ్చేవారు కాదని తెలిపింది.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
Also Read: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?