బాలీవుడ్లో తిరుగులేని నటుడు అమితాబ్ బచ్చన్. అతని పుట్టినరజు సందర్భంగా చిరంజీవి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ ‘సైరా’ సినిమాలో కలిసి నటించారు. అందులో చిరుకు గురువు పాత్రలో నటించారు అమితాబ్. ఆ సినిమా సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు చిరు. ‘నా ప్రియమైన బిగ్ బ్రదర్, గురువు, అమితాబ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆరోగ్యం, ఆనందం, మరింత శక్తిని అందాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ పుట్టినరోజుతో అమితాబ్ 79వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సైరా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అందులో అమితాబ్ పాత్ర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అమితాబ్ 1942, అక్టోబర్ 11న జన్మించారు. అసలు అమితాబ్ శ్రీవాస్తవ. అలహాబాద్లోని ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ కు జన్మించారు అమితాబ్. తల్లి తేజి బచ్చన్ సామాజిక కార్యకర్త. అమితాబ్ కు చిన్నప్పట్నించే నటన అంటే ఆసక్తి. అతని ఆసక్తి మేరకే తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మొదట ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ లో పనిచేశారు అమితాబ్. 1969లో భువన్ షోమ్ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యారు. 1973లో వచ్చని జంజీర్ సినిమా అతని తలరాతను మార్చేసింది. స్టార్ హీరోగా చేసింది. అంతకుముందు వరకు చేసిన సినిమాల్లో దాదాపు 12 సినిమా ఫ్లాపయ్యాయి. జంజీర్ తరువాత వచ్చిన దీవార్, షోలే సినిమాలు అమితాబ్ ను తిరుగులేని హీరోగా మార్చాయి. భారతప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో పాటూ, ప్రతిష్థాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు.