టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూశారు. ‘ఇండియన్ జేమ్స్ బాండ్’గా గుర్తింపు తెచ్చుకున్నఈ మేటి నటుడు ఎన్నో అద్భుత సినిమాల్లో కథానాయకుడిగా చేశాడు. తెలుగు సినిమా పరిశ్రమ కోసం ఎంత కష్టపడ్డారు. ఆయన మరణం పట్ల  టాలీవుడ్ తో పాటు ఇతర సినిమా పరిశ్రమలు నివాళులర్పిస్తున్నాయి. పలువురు సినీ దిగ్గజాలు ఆయన మృతి పట్ల సంతాపం చెప్తున్నాయి. ఇదే సమయంలో కృష్ణకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటి కృష్ణ-చిరంజీవి నడుమ ఓ విడదీయలేని అనుబంధం ఉంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


కృష్ణ పేరిట 2,500 ఫ్యాన్స్ అసోసియేషన్లు


కృష్ణ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు. సాధారణ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి సూపర్ స్టార్ రేంజికి ఎదిగారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని ఎన్నో అంశాలను ఆయన స్పృశించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఒకటేమిటి అనేక విషయాల్లో ఆయన మేటి అనిపించుకున్నారు. సినిమా పరిశ్రమలోనే 24 క్రాఫ్ట్స్ లో ఆయనకు గట్టి పట్టుంది. ఆయన సినిమాలు చూసి ఎంతో మంది తనకు వీరాభిమానులుగా మారిపోయారు. ఒకానొక సమయంలో ఆయనకు 2500కు పైగా అభిమాన సంఘాలు ఉండేవంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆయన సినిమా విడుదల అయినా, పుట్టిన రోజు జరుపుకున్న ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండేది కాదు. ఏదైనా పండుగ జరుగుతుందా? అనేలా సెలబ్రేట్ చేసే వాళ్లు.  పేదలకు వస్త్రదానాలు, రోగులకు పండ్ల పంపిణీ, మరికొంత మంది రక్తదాన శిబిరాలు, ఇంకొందరు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కృష్ణ హీరోగా కొనసాగినంత కాలం అభిమాన సంఘాలు ఎంతో యాక్టివ్ గా ఉండేది. ఆయన అప్పుడప్పుడు తమ అభిమాన సంఘాలన నాయకులను కలిసి మంచి చెడులు తెలుసుకున్న సందర్భాలున్నాయి.


హీరోగా మారిన తర్వాత కూడా కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడుగా చిరు


 సూపర్ స్టార్ కృష్ణ 2008 నుంచి సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. అప్పటి నుంచి అభిమాన సంఘాలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది అభిమానులున్న నటుడు కూడా ఆయనే. అయితే, అంతటి హీరో కూడా ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని. పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కు ఆయన చాలా కాలం అధ్యక్షుడిగా కొనసాగారు కూడా.  ‘తోడు దొంగలు’ సినిమా ప్రచారంలో భాగంగా  ఓ పాంప్లెంట్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిగా చిరంజీవి పేరు కనిపించింది. అప్పటికి చిరంజీవి నటుడిగా కొనసాగుతుండటం విశేషం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో కృష్ణతో కలిసి చిరంజీవి నటించడం విశేషం. మొత్తంగా కృష్ణ-చిరంజీవి నడుమ ఎంతో అనుబంధం ఉండేది.  


Read Also: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు