సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ విజువ‌ల్ వండ‌ర్ RRR. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం ఎన్నో అంతర్జాతీయ అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా రెండు నామినేషన్లు పొందింది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు పాట నామినేట్ అయింది. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో కూడా ఆర్ఆర్ఆర్ పోటీ పడనుంది. 


RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజయాన్ని సాధించి 2022లో ఇద్దరు హీరోలకు మెమొరబుల్ సినిమాగా నిలిచింది.


ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌ తేజ్... ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. RRR లోగో ఉన్న బ్లాక్ క‌ల‌ర్ రాయ‌ల్ సూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఉన్న ఫొటోను రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.


ప్ర‌తి ఏడాది ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా జ‌రిగే ఆస్కార్ అవార్డుల‌కు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.  ఆర్ఆర్ఆర్ ఎంపికైన ఇదే అవార్డుల కేట‌గిరిలను మార్చిలో జ‌ర‌గ‌బోయే అకాడ‌మీ అవార్డ్స్‌లోనూ గెలుచుకుంటుంద‌ని అనుకోవచ్చు. త్వ‌ర‌లోనే ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా ఘ‌నంగా జ‌ర‌గ‌బోయే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మంలో RRR టీమ్‌తో పాటు సినీ తారాలోకమంతా హాజ‌రై ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నుంది.