Hero Sai Dharam Tej Chit Chat With Fans : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2014 నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. ఆ  తర్వాత వరుస సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏండ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ నిర్వహించారు.  #AskSDT పేరుతో అభిమానులతో మాట్లాడారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.


ఫుల్ ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చిన సాయి ధరమ్


చిట్ చాట్ లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఫుల్ ఫన్నీగా ఆన్సర్స్ చెప్పారు. మీ పెళ్లి ఎప్పుడు బ్రో? అని ఓ నెటిజన్ అడగ్గా, నీ వివాహం అయిన వెంటనే అని సమాధానం చెప్పారు. చిన్న మామ పవన్ కల్యాణ్ తో కలిసి సినిమా చేశారు? పెద్దమామ(చిరంజీవి)తో సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడిగితే, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.  రామ్ చరణ్ తో కలిసి నటిస్తారా? అనే ప్రశ్నకు మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానని చెప్పారు.  ప్రస్తుతం ఏఏ సినిమాలు చేస్తున్నారనే ప్రశ్నకు, ఇప్పుడు కేవలం ‘గాంజా శంకర్’ మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. మరోసారి మాస్ మూవీలో నటించడం పట్ల మీ రియాక్షన్ ఏంటనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు. తనకు మాస్ జానర్ అంటే చాలా ఇష్టం అన్నారు. అందుకే మరోసారి అదే జానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు.  


ఫ్యాన్ ప్రశ్నకు బ్రహ్మీ లాఫింగ్ జిఫ్ ఇమేజ్​తో ఆన్సర్


చిట్ చాట్​లో భాగంగా ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశాడు. అర్జెంట్ గా రూ. 10 లక్షలు కావాలని అడిగాడు. అయితే, ఈ ప్రశ్నకు బ్రహ్మానందం నవ్వుతూ ఉండే జిఫ్ ఇమేజ్ పెట్టి వదిలేశారు. ఇక తనకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్రలు ‘చిత్ర లహరి’, ‘రిపబ్లిక్‌’ మూవీస్ లోని క్యారెక్టర్లు అని చెప్పారు. రొటీన్ సినిమాలకు కాకుండా ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు ప్రయత్నించాలని మరో నెటిజన్ సలహా ఇచ్చాడు. దీనికి సాయి ధరమ్, అన్ని  రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అభిమానుల ప్రేమ, సపోర్టు ఉండాలని కోరారు.  ఇక ‘విరూపాక్ష 2’ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు శాసనాల గ్రంథంలో చూసి చెప్పాలంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ఇక ఆయన నటించిన గత రెండు సినిమాలు మంచి విజయం అందుకోవడంతో, అదే జోష్​లో ప్రస్తుతం ‘గాంజా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.    


Read Also: మృణాల్‌తో నాని, అలా సరస్సులో సరదాలు - మరీ ఇంత రొమాంటిక్కా?