OTT Actors: ఇండియాలో ఓటీటీలకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. కరోనా సమయంలో ఆ తర్వాత కూడా ప్రజలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీంతో మేకర్స్ కూడా ఓటీటీలపై దృష్టి పెట్టారు. సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ లు కూడా పోటీ పడే స్థాయికి ఓటీటీల హవా పెరిగింది. ఓటీటీలు పెరిగిన తర్వాత మెల్లగా సినిమా స్టార్స్  కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ చాలా మంది నటీనటులు ఓటీటీలలో నటిస్తున్నారు. అటు సినిమాలు చేన్తూనే ఇటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది నటీనటులు సినిమాల కంటే ఎక్కవగానే ఈ వెబ్ సిరీస్ నుంచి పారితోషికం పుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటులతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంది. సమంత ఇటీవల పలు వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సమంత కూడా ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న జాబితాలోకి చేరిపోయింది. ఆ జాబితాలో ఎవరెవరున్నారో మీరే చూడండి.


అజయ్ దేవగన్..


ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం తీసుకున్న జాబితాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మొదటి స్ధానంలో ఉన్నాడు. ఈయన నటించిన తొలి ఓటీటీ వెబ్ సిరీస్ ‘రుద్ర: దిఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ కోసం ఆయన ఏకంగా రూ.125 కోట్లు తీసుకున్నాడని సమాచారం. 


సైఫ్ అలీ ఖాన్..


ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. ఆయన నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’ సీజన్ 1 లో ఎనిమిది ఎపిసోడ్ లలో ఆయన నటించారు. ఇందుకుగానూ సైఫ్ రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. 


పంకజ్ త్రిపాఠి..


బాలీవుడ్ విలక్షణ నటుల్లో పంకజ్ త్రిపాఠి ఒకరు. ఈయన నటించిన ‘మీర్జాపూర్’ వెబ్ పంకజ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నివేదికల ప్రకారం పంకజ్ తాను నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’ కోసం రూ. 12 కోట్లు అలాగే ‘మీర్జాపూర్ 2’ కోసం రూ. 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.


మనోజ్ బాజ్‌పేయి..


బాలీవుడ్ లో మనోజ్ బాజ్ పేయి కు మంచి గుర్తింపు ఉంది. ఆయన తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ‘ది ఫ్యామిలీ మెన’ వెబ్ సిరీస్ భారీ హిట్ ను అందుకుంది. ఈ వెబ్ సిరీస్ కోసం మనోజ్ దాదాపు రూ.10 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. 


నవాజుద్దీన్ సిద్ధిఖీ..


సూపర్ సక్సెస్ గా స్ట్రీమింగ్ అయిన ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ లో నటించిన మరో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఈయన ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు గానూ దాదాపు రూ.10 కోట్ల రూపాయలను తీసుకున్నాడట. 


రాధికా ఆప్టే..


అదే ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ లో నటించిన మరో నటి రాధికా ఆప్టే. ఈ వెబ్ నటించినందుకు గానూ ఆమె సుమారు రూ.4 కోట్లు తీసుకుందని టాక్. 


సమంత రూత్ ప్రభు..


ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం అందుకుంటున్న జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉండటం విశేషం. సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ ఆమెకు మంచి గుర్తిపును తీసుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకుగానూ సమంత రూ.4 కోట్లు తీసుకుందని సమాచారం. 


Also Read: పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్ - ఫైర్ అవుతున్న నెటిజన్లు!