Martin Luther King Ott Release:  సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్'. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యోగి బాబు ' మండేలా' సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆమె దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక్కడ నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేసి తెరకెక్కించారు. ఓటు విలువ గురించి చెప్పే ఈ సినిమాను  వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్  నిర్మించింది. ఈ పొలిటికల్‌ సెటైరికల్‌ ఫిల్మ్‌ అక్టోబరు 27న థియేటర్లలో విడుదలై చక్కటి ప్రజాదరణ దక్కించుకుంది.


ఈ నెల 29 నుంచి 'మార్టిన్ లూథర్ కింగ్' స్ట్రీమింగ్


తాజాగా ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ అయ్యింది.  ఈ నెల 29 నుంచి సోనీ లివ్‌ లో ఈ  చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. సోనీ లీవ్ సోషల్ మీడియా వేదికగా స్ట్రీమింగ్ డేట్ వివరాలను వెల్లడించింది.     






'మార్టిన్ లూథర్ కింగ్' కథ ఏంటంటే?


స్మైల్‌ (సంపూర్ణేష్ బాబు) ఓ అనాథ. పడమరపాడు అనే ఊళ్లో చెప్పులు కుట్టుకుంటూ జీవినం కొనసాగిస్తారు. ఆ ఊరిలోని మర్రి చెట్టు దగ్గరే ఉంటారు. ఆ ఊరి ప్రజలంతా తనను ఓ అమాయకుడిలా, వెర్రివాడిలా చూస్తుంటారు. ఎవరి ఇంట్లోనైనా పనులు చేయాలంటే ఆయనను పిలుస్తారు. పని చేశాక వాళ్లు ఇచ్చే డబ్బులు, పెట్టే పుడ్ తోనే పూట గడుపుతాడు. ఏదో ఒక రోజు చెప్పుల దుకాణం పెట్టుకోవాలి అనేది ఆయన కోరిక. కష్టపడి సంపాదించుకున్న డబ్బును దాచుకుంటాడు. ఓ రోజు ఆ డబ్బును ఎవరో దోచుకెళ్తారు. దీంతో తన స్నేహితుడి సలహాతో డబ్బును పోస్ట్ ఆఫీస్ లో దాచుకోవాలి అనుకుంటాడు. అప్పుడే పోస్టాఫీస్‌ లో పని చేసే వసంత(శరణ్య ప్రదీప్‌)ను తన డబ్బు దాచుకునే విషయం గురించి చెప్తాడు. కానీ, అక్కడ అకౌంట్ ఓపెన్ చేసేందుకు స్మైల్ కు ఏ గుర్తింపు కార్డు ఉండదు. దీంతో ఆయనకు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అని పేరు పెట్టి పోస్టాఫీస్‌లో అకౌంట్‌ ఓపెన్ చేస్తుంది. తన పేరిట ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేస్తుంది. అదే సమయంలో ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. లోకి (వెంకటేశ్‌ మహా), జగ్గు (నరేశ్‌) సర్పంచ్‌ పదవి కోసం పోటీ పడతారు. ముందస్తు సర్వేలో ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తాయని తెలుస్తుంది. వీరిలో ఎవరు గెలిచినా రూ.30 కోట్ల ప్రాజెక్ట్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఒక్క ఓటు కోసం ఇద్దరు నాయకులు ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చినట్లు తెలుస్తుంది. ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు ఇద్దరు నాయకులు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఆ ఓటు హక్కు తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది? అనేవి సినిమాలో చూడాలి. 


Read Also: కాటన్ చీర, చేతికి వాచ్, నుదిటిన బొట్టు- ఆకట్టుకుంటున్న సారా కొత్త సినిమా లుక్