మణిశర్మ... తెలుగు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సూపర్  హిట్ సినిమాలకు ఆయన సంగీతం  అందించారు. మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. గాయని సంజనను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి చెన్నైలోని టీ నగర్ దగ్గరున్న ద అకార్డ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ పెళ్లికి సన్నిహితుల మధ్య జరిగింది. కొంతమంది సినీప్రముఖులు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ సెలెబ్రిటీల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని మణిశర్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పెళ్లికి పెద్దగా తెలుగు సినీ ప్రముఖులు పాల్గొనలేదని టాక్. 


మహతి కూడా పేరున్న సంగీత దర్శకుడే. ఇప్పటికే మ్యూజికల్ హిట్ లను అందించాడు. ఛలో, భీష్మ, మ్యాస్ట్రో సినిమాలకు సంగీతం అందించింది మహతినే. కాగా చిరంజీవి సినిమా బోళా శంకర్ కు కూడా ఇతనే సంగీత దర్శకుడు. వేదాళం రీమేక్ గా బోళా శంకర్ నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. భీష్మలోని ‘హేయ్ చూశా’ అనే పాటను కూడా పాడాడు మహతి సాగర్. తన తండ్రి పనిచేసే సినిమాలకు సౌండ్ ఇంజినీర్ గా కూడా పనిచేశాడు. ఇక పెళ్లికూతురు సంజన కూడా మంచి గాయని. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం ఫోటోలు నెట్ లో బాగా వైరల్ అయ్యాయి. 






Also read: గర్భిణీలలో ఈ లక్షణాలు కనిపిస్తే సిజేరియన్ తప్పదా?


Also read: డేటింగ్ యాప్ పై కోర్టుకెళ్లిన యువకుడు... కారణం తెలిస్తే నవ్వుకుంటారు


Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?


Also read:  ఆ సమస్యా ఉన్నా ఇలా చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్


Also read:  డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి