దర్శకుడు మణిరత్నం సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఆయన తీసే సినిమాలు బాలీవుడ్ లో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన నుంచి సరైన సినిమా రాలేదు. ఆయన నుంచి చివరిగా వచ్చిన సినిమా 'నవాబ్'. తమిళంలో ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కానీ తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న మణిరత్నం ఇప్పుడు మరోసారి తన ప్రతిభ చూపించడానికి రెడీ అవుతున్నారు. 

 

1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి కూడా అదే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను మణిరత్నంతో పాటు లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, మోహన్ బాబు, ఐశ్వర్యా రాయ్ వంటి పేరున్న తారలు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. నిజానికి ఈ సినిమా జూలై నెలలో విడుదల చేయాలనుకున్నారు. 

 

కానీ ఇప్పుడు సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రవి వర్మన్ కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.