Manchu Vishnu To Be Launch Book On Kannappa: మంచు విష్ణు స్వీయ నిర్మిస్తూ.. నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది ఈ మూవీ. థాయ్‌లాండ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్‌  చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటివల మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయగా దానికి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. 


"కన్నప్ప ఫస్ట్‌ లుక్‌పై ప్రేక్షకులు చూపిస్తున్న విశేష ఆదరణకు ధన్యవాదాలు. నిజానికి ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసే ముందుకు నేను కాస్తా కంగారుపడ్డాను. ఎందుకంటే గతంలో నేను ఇలాంటి సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఈ తరహా కథలో నటించడం మొదటిసారి. ఇది ఆ ఈశ్వరుడి దయ. ఆయన కథను చెప్పే అవకాశం, కన్నప్పగా నటించే అవకాశం రావడం నా అద్రష్టం. అయితే చాలా మంది కన్నప్ప చరిత్రపై నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. తమిళ్‌, మలయాళి ప్రజలను నుంచి నాకు ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే నార్త్‌ ప్రజలు కూడా అడుగుతున్నారు. ఉత్తరాది ప్రజలు కన్నప్ప ఎవరూ, ఆయన చరిత్ర ఎంటన్నది తెలియదు. ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం.






అందుకే కన్నప్ప చరిత్ర, శ్రీకాళహస్తి గురించి అందరికి తెలిసేలా ఓ నిర్ణయం తీసుకున్నాను. మార్చి 19న ఆయన కథను తెలియజేస్తూ ఫస్ట్‌ వాల్యూమ్‌గా కన్నప్ప పేరుతో కామిక్‌ బుక్‌ విడుదల చేస్తున్నా. ఇదొక కథల పుస్తకం. ఆ రోజు నా తండ్రి నేను అభిమానించే నటుడు మోహన్‌బాబు గారి పుట్టినరోజును పురుస్కరించుకుని ఈ బుక్‌ రిలీజ్‌ చేస్తున్నాం. ఈ పుస్తకం కావాలనుకున్నవారు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు సందేశం పంపండి. తప్పకుండ మా సిబ్బంది మీకు వాటిని పంపిస్తారు. గమనిక: దీనికి ఎలాంటి డబ్బులు వసూళు చేయడం లేదు. ఎందుకంటే కన్నప్ప కథ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నాది. అందుకు ఉచితం కన్నప్ప బుక్స్‌ని మీకు అందజేయాలనుకుంటున్నా" అంటూ ఈ వీడియోలో విష్ణు చెప్పుకొచ్చాడు. 


Also Read: నేను అందంగా ఉండనని తెలుసు - అందరు అమ్మాయిల్లాగే నేను కూడా - సమంత షాకింగ్‌ కామెంట్స్


అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై  కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్‌లు స్క్రిన్‌ప్లే అందించిన ఈ సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.