Manchu Lakshmi: మంచు లక్ష్మికి కరోనా.. త్వరగా అలా చేయమని సూచనలు

మంచు లక్ష్మికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

Continues below advertisement

కరోనావైరస్ థర్డ్ వేవ్ మనదేశంలో శరవేగంగా విస్తరిస్తుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా సోకుతోంది. తాజాగా మంచు లక్ష్మికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. రెండు సంవత్సరాల పాటు కరోనాకు దొరక్కుండా తప్పించుకుంటున్న తనను ఆ మహమ్మారి సోకిందని, ఇప్పుడు కరోనాతో పోరాడతానని ట్వీట్‌లో పేర్కొంది. అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది.

Continues below advertisement

‘ఇది సాధారణ జలుబులాగా అందరికీ సోకనుంది. మన రోగనిరోధక శక్తిని పెంచుకుని, వైరస్‌తో పోరాడటానికి మన శరీరాలను సిద్ధం చేయాలి. మీ విటమిన్లను తప్పనిసరిగా తీసుకుంటూ, మెదడును, శరీరాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ రెండు డోసులు తీసుకున్నట్లయితే.. బూస్టర్ కూడా తీసుకోండి. మీ టాప్-3 ఫేవరెట్ షోలు, సినిమాలను నాకు తెలపండి.’ అని ట్వీట్‌లో పేర్కొంది.

గతవారం మంచు మనోజ్ కూడా తనకు కరోనా సోకినట్లు ట్విటర్‌లోనే ప్రకటాంచాడు. సరిగ్గా తనకు పాజిటివ్ వచ్చిన వారానికే మంచు లక్ష్మికి కూడా కరోనా సోకింది. 

Continues below advertisement
Sponsored Links by Taboola