Revathy Sampath On Riyaz Khan: మలయాళీ సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తర్వాత మహిళా నటులు బయటకు వచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన మలయాళీ నటి రేవతి సంపత్, ఇప్పుడు మరో నటుడుపై తీవ్ర ఆరోపణలు చేసింది. నటుడు రియాజ్ ఖాన్ కూడా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. అర్థరాత్రి తనకు ఫోన్ చేసి పడుకుంటావా? అని అడిగాడని వెల్లడించింది.
రియాజ్ గురించి రేవతి షాకింగ్ కామెంట్స్
సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన తర్వాతరేవతి ఓ మలయాళీ మీడియా సంస్థతో మాట్లాడింది. ఈ సందర్భంగా రియాజ్ ఖాన్ తనను ఎలా వేధించాడో వివరించే ప్రయత్నం చేసింది. రియాజ్ ఖాన్ ఫోన్ చేసి, తనతో పడుకుంటావా? అని అడగడంతో పాటు ఎవరైనా అమ్మాయిలు ఉంటే పంపించాలని కోరాడని చెప్పింది. “ఇటీవల ఒక నటుడు చెప్పిన 'అడిచి కేరి వా' డైలాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఆ నటుడి నుంచి ఓ రోజు అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ నా అనుమతి లేకుండా నా ఫోన్ నంబర్ ను అతడికి ఇచ్చాడు. ఫోన్ లో సెక్స్ వల్ విషయాలు మాట్లాడాడు. నాతో పడుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగాడు. నీకు ఇష్టమైన పొజిషన్ ఏంటో చెప్పాలన్నాడు. ఈ సంఘటన నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది. అతడి మాటలు విని నేను షాక్ అయ్యాను. ఆ ఫోన్ కాల్ లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదని తనకు అర్థం అయ్యింది. మరో 9 రోజులు తాను కొచ్చిలోనే ఉంటాను. ఎవరైనా అమ్మాయిలు ఉంటే పంపించాలని కోరాడు” అని రేవతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రియాజ్ ఖాన్ వ్యవహారం మలయాళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగులోనూ పలు సినిమాలు చేసిన రియాజ్
నటుడు రియాజ్ తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘దొంగలు’, ‘శివ శంకర్’, ‘గురు’, ‘నాయకుడు’, ‘నాయుడమ్మ’, ‘స్టాలిన్’, ‘రాజాబాబు’, ‘తులసి’, ‘కారా మజాకా’, ‘www’, ‘అలా ఇలా ఎలా’ అనే సినిమాల్లో నటించాడు.
పదవికి రాజీనామా చేసిన సిద్ధిక్
రీసెంట్ గా మలయాళ నటుడు సిద్ధిక్‌పై రేవతి లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్ కు అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నిజానికి రేవతి 2019లోనే సిద్ధిక్ గురించి చాలా విషయాలు చెప్పింది. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి తనకు ఎదురైన వేధింపుల గురించి వివరించింది. సిద్ధిక్ లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, అతడిని ఇండస్ట్రీ నుంచి నిషేధించాలని ఆమె డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మలయాళీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.
Read Also: ఆ నటుడు నన్ను వెనుక నుంచి వాటేసుకున్నాడు, మరొకరు రూమ్‌కు పిలిచి..: నటి మిను మునీర్