సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్ లో 'సర్కారు వారి పాట' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ ను వదిలారు. సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ వదిలిన ఈ వీడియో రికార్డులు సృష్టించింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ముఖ్యంగా మహేష్-కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పడింది. ఈ జంటను తెరపై చూడడానికి ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు గోవాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది. మహేష్ బాబుతో సహా టీమ్ మొత్తం గోవాకి వెళ్లింది. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ల సహాయంతో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ స్టిల్ ను చిత్రబృందం విడుదల చేసింది.
Also Read : Anu Emmanuel Photos : అను బేబీ హాట్ క్లీవేజ్ షో.. ఇన్‌స్టాగ్రామ్ లో రచ్చ..
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యమైంది. కరోనా సమయంలో మహేష్ బయటకి రాకపోవడంతో అందరికంటే లేట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. అదే విషయాన్ని దర్శకుడు పరశురామ్ కి చెప్పి ఆయనొకక టార్గెట్ ఇచ్చారట మహేష్ బాబు. ఈ సినిమాను 45 రోజుల్లో పూర్తి చేయమని మహేష్ ఆదేశాలు జారీ చేశారట. ఈ సినిమాను పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి మహేష్.
Also Read : Paagal Twitter Review : విశ్వక్ సేన్ 'పాగల్'కి ఆడియన్స్ రివ్యూ..
ఇప్పటికే త్రివిక్రమ్ చాలా కాలంగా మహేష్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే మహేష్ 'సర్కారు వారి పాట'ను త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.