సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు.


కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఏప్రిల్ 1, 2022లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ డేట్ న కూడా సినిమా రావడం లేదని తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడంతో మిగిలిన సినిమాలన్నీ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' సినిమాను సమ్మర్ కనుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ.. షేర్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు రిలాక్స్ అవుతున్నట్లుగా కనిపించారు. 


మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.