తెలుగు చిత్రసీమ చరిత్రలో ఓ నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు రెండు రోజుల్లో సంక్రాంతికి విడుదలైన సందర్భం లేదు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న 'వీర సింహా రెడ్డి'తో వచ్చే ఏడాది అరుదైన రికార్డు నెలకొల్పడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీ అయ్యింది.


'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి'... రెండూ మాస్ సినిమాలు. పండగ సీజన్ క్యాష్ చేసుకునే అంశాలు రెండిటిలో పుష్కలంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ లెక్కల పరంగా రికార్డులు క్రియేట్ ఛాన్స్ ఉంది. అయితే... మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల బాకీలు ఈ సినిమాలపై పడితే, రికార్డులు కష్టం అనేది ట్రేడ్ వర్గాల టాక్. అదేంటి? ఎందుకు అలా? అనే వివరాల్లోకి వెళితే... 


చిరంజీవి, బాలకృష్ణ సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నైజాంలో సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేస్తోంది. అక్కడ ఎటువంటి సమస్య లేదు. అసలు ప్రాబ్లమ్ అంతా ఏపీలో అని టాక్. ఎందుకంటే... మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గత ఏడాది చివర్లో అల్లు అర్జున్ 'పుష్ప : ది రైజ్' సినిమా వచ్చింది. ఉత్తరాదిలో ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఏపీ, తెలంగాణలోనూ మంచి వసూళ్లు సాధించింది. అయితే... కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులు తిరిగి రాలేదని ఇండస్ట్రీ గుసగుస. ఈ ఏడాది విడుదలైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విషయంలో కూడా అంతేనట!


'సర్కారు వారి పాట' సూపర్ సక్సెస్ సాధించిందని యూనిట్ సెలబ్రేషన్స్ చేసింది. వసూళ్ళ లెక్కలు ఘనంగా అనౌన్స్ చేశారు. అయితే, అసలు విషయం వేరే ఉందట. ఏపీలో కొన్ని ఏరియాల్లో ఆ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయట. ఆ రెండు సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలకు జరిగిన చర్చల్లో తర్వాత సినిమాల విషయంలో అడ్జస్ట్ చేసేలా మాటలు కుదిరాయని సమాచారం. 


'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్న మైతీ మూవీ మేకర్స్ అధినేతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేనిలను 'సర్కారు వారి పాట', 'పుష్ప : ది రైజ్' బాకీల గురించి కొందరు డిస్ట్రిబ్యూటర్లు క్వశ్చన్ చేస్తున్నారట. అందువల్ల, సంక్రాంతి సినిమాల డీల్స్ ఇంకా కాజ్ కాలేదని టాక్. ఒకవైపు ఈ టెన్షన్స్ పక్కన పెడితే... మరోవైపు ఫ్యాన్స్ నుంచి వచ్చే ప్రెజర్, ప్రమోషన్స్ స్ట్రాటజీల విషయంలో రెండు సినిమాలకు సమ న్యాయం చేయాల్సిన పరిస్థితి మైత్రీ మూవీ మేకర్స్ ముందుంది.


Also Read : 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?
   
సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు రావడం కన్ఫర్మ్. వచ్చే ఏడాది థియేటర్ల దగ్గర మాస్ జాతర మూమూలుగా ఉండేలా లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న 'వారసుడు'తో విజయ్, 'తునివు' సినిమాతో అజిత్... తమిళ స్టార్స్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఎలాగో ఉన్నాయి. 'వీర సింహా రెడ్డి' 'వారసుడు' సినిమాలు జనవరి 12న వచ్చే అవకాశాలు ఉన్నాయట. అజిత్ 'తునిను' జనవరి 11న రిలీజ్ కానుంది. జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' వస్తుందట. ఒకవేళ అజిత్ సినిమాతో పోటీకి వెళ్ళాలని అనుకుంటే... 'వారసుడు' కూడా 11న విడుదల కావచ్చు.