సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమాపై ఓ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్. 


ఇటీవల ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ కి రాజమౌళి-మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందని అడగ్గా.. వచ్చే ఏడాది మొదలవుతుందని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. 


ఇంకా కథ పూర్తి కాలేదని.. అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెప్పారు. త్వరలోనే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా మొదలుకానుంది. నవంబర్ నాటికి త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయాలనేది మహేష్ ప్లాన్. 2023లో రాజమౌళి సినిమాను పట్టాలెక్కించనున్నారు. సినిమా మొదలుపెట్టడానికి ముందు రెండు, మూడు నెలల పాటు రాజమౌళి.. మహేష్ తో ట్రావెల్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. 


ప్రస్తుతం మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. 


Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?


Also Read: చీపురు పుల్లలతో చిరు, చెర్రీ కోసం సర్‌ప్రైజ్ గిఫ్ట్ - ఆ టాలెంట్‌కి రామ్ చరణ్ ఫిదా, ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం