మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా ‘హీరో’. ఈ సంవత్సరం సంక్రాంతికి థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇప్పుడు లాక్ అయింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఇదే సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు జీ5లో స్ట్రీమ్ కానుంది. రౌడీ బాయ్స్ సినిమా మాత్రం విడుదలైన 50 రోజుల వరకు ఓటీటీకి రాదని దిల్ రాజు గతంలోనే తెలిపారు. అయితే ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో రానుందో మాత్రం తెలియరాలేదు.
ఇక హీరో విషయానికి వస్తే.. గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, రవి కిషన్, సీనియర్ నరేష్, సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కించారు.
కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్య, వెన్నెల కిషోర్.. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో బ్రహ్మాజీ ఎపిసోడ్లు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. ఓటీటీలో మంచి కామెడీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ కానుంది. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా వేరే తేదీన విడుదల చేయాలనుకున్నప్పటికీ.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పోటీ నుంచి తప్పుకోవడంతో జనవరి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేశారు.