Hero Mahesh Babu New Look: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇవాళ(ఆగష్టు 9న) ఆయన 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49వ ఏట అడుగు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన విజువల్స్ ను ఓ అభిమాని కెమెరాలో బంధించారు. మహేష్ బాబు ప్రతి ఏటా తన బర్త్ డేను విదేశాల్లో జరుపుకోవడం విశేషం. ఈసారి కూడా తన బర్త్ డేను ఫారిన్ లోనే జరుపుకుంటున్నారు. వీలైనంత వరకు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. అయితే, ఈ విజువల్స్ లో ఆయన మాత్రమే కనిపించారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? లేదా? అనేది కనిపించలేదు.  


నయా లుక్ లో కనిపించిన మహేష్ బాబు


తాజా వీడియోలో మహేష్ బాబు సరికొత్త గెటప్ లో కనిపించారు. భుజానికి లగ్జరీ లూయిస్ విట్టన్ బ్యాగ్ వేసుకుని, క్యాప్ పెట్టుకుని, నల్ల కల్లజోడుతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోనీ టైల్ గెటప్ లో కనిపించారు. ప్రిన్స్ కొత్త లుక్ అభిమానులను అలరిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం కోసం ఆయన తన లుక్ ను పూర్తిగా మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చుకుంటున్నారు. నిజానికి రాజమౌళి సినిమాల్లో హీరో జుట్టు ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఈ సినిమాలోనూ మహేష్ బాబు జుట్టు పొడవుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఈ మధ్య మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ కనిపించకుండా వీలైనంత వరకు క్యాప్ తో కవర్ చేస్తున్నారు.


త్వరలో సెట్స్ మీదికి రానున్న రాజమౌళి, మహేష్ బాబు మూవీ


మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లోఈ  పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కబోతోంది. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఏకంగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికూ హైదరాబాద్ లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యాక్టర్స్ సెలెక్షన్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎంపిక పూర్తి కాగానే మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. కెఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.  



Read Also: ఎక్కడికి వెళ్లినా మహేష్‌ బాబు టోపీతో ఎందుకు కనిపిస్తున్నాడు? జక్కన్న సినిమాకు ఏమైనా లింక్ ఉందా?