'బిగ్ బాస్' సోహైల్ (Syed Sohel) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లక్కీ లక్ష్మణ్' (Lucky Lakshman Movie). ఇందులో మోక్ష హీరోయిన్. ఎ.ఆర్. అభి దర్శకత్వం వహించారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని' చిత్రాన్ని నిర్మించారు.
త్వరలో 'లక్కీ లక్ష్మణ్' విడుదల
'లక్కీ లక్ష్మణ్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. త్వరలో అనౌన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.
Lucky Lakshman Teaser Review : 'లక్కీ లక్ష్మణ్' టీజర్ చూస్తే... కాన్సెప్ట్ ఏంటి? అనేది ఈజీగా అర్థం అవుతుంది. తానొక అన్ లక్కీ అని ఫీలయ్యే అబ్బాయి కథతో సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాతలు గతంలో చెప్పారు. అతడి దురదృష్టం ఎలా ఉంటుందో టీజర్‌లో చూపించారు.
'అందరూ అదృష్టం ఇంటిలో ఉండాలని అనుకుంటారు. కానీ, అదే అదృష్టం ఇంటి పేరు అయితే?' అని సోహైల్ చెప్పే డైలాగుతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చే సీన్స్ చూస్తే... అతడికి అదృష్టం కాదు, దురదృష్టం అని మనకు తెలియడానికి ఎక్కువ సేపు పట్టదు.
స్కూల్‌లో తోటి విద్యార్థులతో పిక్‌నిక్‌కు వెళ్ళడానికి వంద రూపాయలు అడిగితే... 'ఆ వంద ఉంటే (కొత్త సాక్స్ కొంటాను కాను) ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి ఎందుకు పంపిస్తాను?' అని కుమారుడితో తండ్రి చెప్పడం చూస్తే విషయం అర్థం కాలేదూ! ఇక, అమ్మాయిల విషయంలో కూడా లక్ష్మణ్ దగ్గర లక్ లేదు. ఇద్దరూ ఒకేసారి 'గుడ్ బై' చెప్పేసి వెళతారు. ''నువ్వు కాకపోతే లక్ష్మణ్ గాడిని లక్ష మంది కోరుకుంటున్నారు'' అని సోహెల్ చెప్పే డైలాగ్ హీరో క్యారెక్టర్, యాటిట్యూడ్ చెబుతోంది.
''ఆస్తుల్ని అమ్ముకున్నోడు అయినా పైకి వస్తాడు ఏమో గానీ... అమ్మాయిలను నమ్ముకున్నోడు మాత్రం పైకి రాలేదురా'' అని హీరో చెప్పే డైలాగుతో టీజర్ ముగించారు. మొత్తం మీద టీజర్ యూత్‌ఫుల్‌గా ఉంది. ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకు వచ్చేలా కనబడుతోంది.
Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?
అన్ లక్కీ అని ఫీలయ్యే అబ్బాయి కథ!
''లక్ష్మణ్... తానొక అన్ లక్కీ ఫెలో అని ఫీలవుతాడు. అతడి చుట్టూ ఉన్న వారంతా లక్కీ ఫెలో అని చెబుతున్నా వినడు. తాను ఎప్పటికీ అన్ లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఆ యువకుడి జీవితంలో జరిగిన ఆసక్తికర అంశాలతో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది'' అని దర్శక - నిర్మాతలు చెప్పారు.
సోహెల్, మోక్ష జంటగా నటించిన 'లక్కీ లక్ష్మణ్' సినిమాలో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, రచ్చ రవి , 'జబర్దస్త్' కార్తిక్, జబర్దస్త్ గీతూ రాయల్, 'కామెడీ స్టార్స్' ఫేమ్ యాదమ్మ రాజు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి నృత్యాలు : విశాల్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయానంద్ కీత, ఛాయాగ్రహణం : ఐ. ఆండ్రూ, పాటలు : భాస్కరభట్ల రవికుమార్, సంగీతం : అనూప్ రూబెన్స్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం : ఏఆర్ అభి.