కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి చాలా కాలంగా తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా 'ది వారియర్'తో ఆయన కల నిజమైంది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు రామ్. నిజానికి లింగుస్వామి.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సివుంది. 'పుష్ప'కి ముందు వీరి కాంబోలో సినిమా రావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ పక్కకు జరిగింది. 


ఇప్పుడు బన్నీకి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ రావడంతో లింగుస్వామి ప్రాజెక్ట్ ఉండదని అంతా అనుకున్నారు కానీ లింగుస్వామి మాత్రం బన్నీతో తప్పకుండా సినిమా చేస్తానని చెబుతున్నారు. 'ది వారియర్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన.. బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నానని చెప్పారు. కథల గురించి మాట్లాడుకుంటామని.. పదిహేను రోజుల క్రితం కూడా బన్నీని కలిసి మాట్లాడానని చెప్పారు. 


వారిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని నమ్మకంగా చెప్పారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు లింగుస్వామి. ఆయన దర్శకత్వంలో బన్నీ సినిమా అంటే మంచి బజ్ వస్తుంది. అయితే 'ది వారియర్' సినిమా రిజల్ట్ ని బట్టి బన్నీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లింగుస్వామి కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే. ఎందుకంటే చాలా కాలంగా ఆయనకు సరైన హిట్టు పడలేదు. కోలీవుడ్ లో కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ విజయం లేదు ఆయనకు. వారియర్ గనుక హిట్ అయితే లింగుస్వామి మునుపటి ఫామ్ లోకి రావడం ఖాయం. 


Also Read: విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుంది - సారా అలీఖాన్ కామెంట్స్!


Also Read: 'ఫుల్లుగా తాగేసి ఇంటికెళ్లా, ప్రెగ్నెన్సీ విషయంలో అబద్దం చెప్పా' - రెజీనా కామెంట్స్!