మనుషులు అడవులను ఆక్రమిస్తుంటే.. అక్కడ బతకాల్సిన పులులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలను భయాందోళనలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే కాకినాడలో ఓ పులి ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎలుగుబంటి ఏకంగా జనాలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు కూడా. అయితే, అటవీ ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో ఏవైపు నుంచి వన్య మృగాలు వస్తాయో చూసుకోవాలి. లేకపోతే.. వాటికి మనం ఆహారమైపోతాం.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తాజా ఓ వీడియోను ట్వీట్ చేశారు. అందులో ఓ చిరుత పులి కారు బొన్నెట్‌లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. హైవే మీద నుంచి వెళ్తున్న ఓ కారుకు చిరుత పులి అడ్డంగా వచ్చింది. దీంతో కారు ఆ పులిని బలంగా ఢీకొట్టింది. కారు బొన్నెట్‌లో చిక్కుకున్న పులి బయటకు రాలేక ఇబ్బందిపడింది. కారు రివర్సు చేసినా అది రాలేకపోయింది.
ఇదే వీడియోను రవీనా టాండన్ కూడా ట్వీట్ చేశారు. రవీనా పోస్ట్ చేసి వీడియోలో పులి బన్నెట్ నుంచి విడిపించుకుని అడివిలోకి పరిగెట్టడం కనిపించింది. ‘‘ఈ అందమైన చిరుతపులి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. అది తీవ్రంగా గాయపడినప్పటికీ అడవిలోకి పారిపోయింది. రాజకీయ నాయకులు మేల్కొని పరిరక్షణ పద్దతులు గురించి కూడా ఆలోచించి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆశీస్తున్నా’’ అని రవీనా టాండన్ పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
Also Read: తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
Also Read: కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు