విశాల్, సునయన హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లాఠీ’. ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రమణ, నంద నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా గత నెల 22న విడుదల అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలోకి విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.


జనవరి 14 నుంచి సన్‌ నెక్స్ట్‌ వేదికగా స్ట్రీమింగ్


విశాల్ ‘లాఠీ’ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను సన్‌ నెక్స్ట్‌ దక్కించుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జనవరి 14 నుంచి సన్‌ నెక్స్ట్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కాబోతున్నట్లు వెల్లడించింది. సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. విశాల్ ‘లాఠీ’ మూవీ కోసం థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  






నిజానికి జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తారు హీరో విశాల్. యాక్షన్ జానర్‌లో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఆయన నటించిన 'లాఠీ' సైతం అలాంటి కథతోనే వచ్చింది. సాధారణంగా పోలీస్ కథలు అంటే హీరోలను ఐఏఎస్, మరీ తక్కువ అంటే ఎస్ఐగా చూపిస్తారు. కానీ, ఈ సినిమాలో హీరో ఓ సాధారణ కానిస్టేబుల్ గా కనిపిస్తారు. దర్శకుడు ఈ సినిమా కథను చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లారు. ఇంతకీ ఈ సినిమా కథ ఎలా ఉందంటే?  


‘లాఠీ’ మూవీ కథ ఇదే!


జి. మురళీ కృష్ణ (విశాల్) కానిస్టేబుల్. ఓ కేసు విషయంలో సస్పెండ్ అవుతాడు. మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావడం కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతాడు. గతంలో నిజాయతీగా పని చేసినందుకు ప్రతిఫలంగా ఓ అధికారి సాయం చేస్తాడు. మళ్ళీ ఉద్యోగంలో చేరతాడు. భార్య కవి (సునైన), కుమారుడు రాజు (మాస్టర్ లిరిష్ రాఘవ్)తో హ్యాపీగా జీవిస్తున్న మురళీ కృష్ణ ముందు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చీకటి ప్రపంచానికి దాదా శూర (సన్నీ పీఎన్), అతని కొడుకు వీర (నటుడు రమణ) అటాక్ చేస్తారు. ఓ సాధారణ కానిస్టేబుల్ కోసం సిటీలో రౌడీలు, పోకిరీలు అందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు చంపాలని కంకణం కట్టుకున్నారు? ఆ తర్వాత ఏమైంది? కరుడుగట్టిన కూనీకొరులతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Read Also: ‘ధమాకా‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు, ఎక్కడో తెలుసా?