Bhogi Wishes in Telugu 2023: తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. జనవరి 14 శనివారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజుల పాటూ ముచ్చటగా సాగుతుంది. పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేసి.. ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ..మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటలు వెనుక ఉన్న ఆంతర్యం. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో భోగి శుభాకాంక్షలు చెప్పేయండి

భోగ భాగ్యాల భోగి..సరదాల సంక్రాంతి..కమ్మనైన కనుమ..మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూమీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

గతానికి వీడ్కోలు పలుకుతూరేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికేభోగి పండుగ సందర్భంగాఅందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలికొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలిమీ అందరికీ భోగి శుభాకాంక్షలు

పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు... ఈ భోగి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తేవాలిహ్యాపీ భోగి 

భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలిమీ ఇంట భోగభాగ్యాలు రావాలిమీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

చెడును దహించే భోగి మంటలు.భోగాలను అందించే భోగి పండ్లు..ఘుమఘుమలాడే పిండి వంటలు..కీర్తనలు పాడే హరిదాసులు..సంక్రాంతికి తెచ్చేను సందళ్లు..సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు.మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు

Also Read: సంక్రాంతి ఆద్యంతం సందడి చేసే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ ఎవరో తెలుసా!

ఈ భోగి మీ చీడ-పీడలను తొలగించాలని..మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని..భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆశిస్తూ.. అందరికీ.. భోగి పండగ శుభాకాంక్షలు!

ఈ భోగి మీకు సకల భాగ్యాలను అందించాలని ఆ దేవుడిని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు.

మీలోని చెడును, వ్యసనాలను భోగి మంటల్లో వేసేయండిజీవితంలోకి కొత్త వెలుగులను ఆహ్వానించండి.అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు!

Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!

ఈ భోగి భోగభాగ్యాలతోపాటు..మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ..అందరికీ భోగి శుభాకాంక్షలు.

భోగి మంటల వెచ్చని వెలుగులు..రంగవల్లుల్లో గొబ్బిళ్లు..కొత్త బియ్యపు పొంగళ్లు..అందరి మది ఆనందంతో పరవళ్లు..పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగుదనానికి తలమానికంగా నిలిచే ప్రతి ఇల్లు..కుటుంబాలను దగ్గరకి చేర్చే మూడు రోజులు.. మీ జీవితాల్లో మరిన్ని మధురానుభూతులు నింపాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు.

నింగిని తాకే పతంగులు..పలనాడులో కోళ్ల పందేలు..చిందులువు వేసే బసవన్నలు..సంక్రాంతి మూడు దినాలు..చూడతరమా పల్లె అందాల సోయగాలుమీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే.. మకర సంక్రమణంజనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని.. రవికిరణంభోగభాగ్యాల భోగి.. సంతోషాల సంక్రాంతి..సుఖసంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి మీ కష్టాలన్నీ దహించి వేయాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.