తమిళనాడు ఊటీలో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్‌కు సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. ఈ ఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికలతో పాటు మరో 11 మంది ఆర్మీ అధికారులు మరణించారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ లతా మంగేష్కర్, కంగనా రనౌట్, కమల్ హాసన్ వంటి ఎందరో సెలబ్రిటీలు బిపిన్ రావత్‌కు ట్వీటర్ వేదికగా నివాళులు అర్పించారు.