లెజెండరీ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతరత్న లతా మంగేష్కర్(92) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పటినుంచి ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ను హాస్పిటల్ యాజమాన్యం వెల్లడిస్తూనే ఉంది.


తాజాగా ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని మహారాష్ట్ర మినిష్టర్ రాజేష్ తోప్ ఆదివారం నాడు వెల్లడించారు. కోవిడ్,న్యుమోనియా నుంచి ఆమె కోలుకున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. 'లతా మంగేష్కర్ గారికి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ ప్రతిత్ సందానితో నేను మాట్లాడాను. ఆమె కోలుకుంటున్నట్లు చెప్పారు. కొన్నిరోజుల పాటు ఆమెని వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందించారు. ఇప్పుడు వెంటిలేటర్ తొలగించి ఆమెని రూమ్ కి షిఫ్ట్ చేశారు. సిలిండర్లు ద్వారా ఆమెకి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆమె ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చారు. 


భారతదేశం గర్వించదగ్గ సింగర్స్ లో లతా మంగేష్కర్ ఒకరు. పదమూడేళ్లకే ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె దడపా ముప్పై వేల పాటలను పాడారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం ఇలా చాలా భాషల్లో పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.