తమిళ సంగీత దర్శకుడు, హీరో విజయ్ ఆంటోనిని తెలుగులో స్టార్ చేసిన సినిమా 'బిచ్చగాడు'. ఆ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాస రావు తెలుగులో విడుదల చేశారు. ఆ తర్వాత కంటెంట్ బేస్డ్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు. తమిళంలో 'జయం' రవి హీరోగా నటించిన 'టిక్ టిక్ టిక్'ను తెలుగులో విడుదల చేయడంతో పాటు 'వలయం', 'గ్యాంగ్‌ స్టర్ గంగరాజు', 'మా నాన్న నక్సలైట్' సినిమాలు తీశారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన తాజా సినిమా 'ధీర'. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  


ఫిబ్రవరి 2న 'ధీర' విడుదల
Dheera Telugu Movie Release Date: లక్ష్ చదలవాడ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ధీర'. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. 'వలయం', 'గ్యాంగ్‌ స్టర్ గంగరాజు' తర్వాత లక్ష్ నటించిన చిత్రమిది. దీనికి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'ధీర' గ్లింప్స్, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 2న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


Also Read: సితార గొప్ప మనసు - అనాథల కోసం 'గుంటూరు కారం' స్పెషల్ షో


''ధీర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సెన్సార్ కూడా పూర్తి చేశాం. ఫిబ్రవరి 2న గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నాం. కాన్సెప్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్... రెండు ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది'' అని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇటీవల సినిమా మేకింగ్ వీడియో విడుదల చేశారు. అందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమా ఎలా తెరకెక్కించినది, ఎంత కష్టపడినది చూపించారు. అది అందరినీ ఆకట్టుకుంటోంది.


Also Readనంబర్ వన్ బుల్ షిట్ గై... 'బాబు'తో బజ్జీ పాప



కీలక పాత్రలో 'బిగ్ బాస్' సామ్రాట్
'ధీర' సినిమాలో సామ్రాట్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేసిన సామ్రాట్... ఆ తర్వాత టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ అయ్యారు. ఆయన మాఫియా బ్యాక్డ్రాప్ రోల్ చేస్తున్నట్లు తెలిసింది.


Also Read: రామ మందిరం ప్రారంభోత్సవం ... ఆహ్వానం అందింది కానీ వెళ్లలేకపోతున్నా - మోహన్ బాబు



లక్ష్ చదలవాడ హీరోగా నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్లుగా నటించిన 'ధీర' సినిమాలో 'మిర్చి' కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, 'వైవా' రాఘవ, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు కూర్పు: వినయ్ రామస్వామి, ఫైట్ మాస్టర్: జాషువా - 'వింగ్ చున్' అంజి, ఛాయాగ్రహణం: కన్నా పీసీ, సంగీతం: సాయి కార్తీక్, సమర్పణ: చదలవాడ బ్రదర్స్, నిర్మాణ సంస్థ: బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, నిర్మాత: పద్మావతి చదలవాడ, రచన - దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్.