బాలీవుడ్ స్టార్ హీరోస్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్‌ల మధ్య పోటాపోటీ నెలకొంది. అమీర్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ సినిమాలు ఒకే రోజు (ఆగస్టు 11 - గురువారం) థియేటర్లలో విడుదలయ్యాయి. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’కు మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా తప్పకుండా కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ను ఒడ్డును పడేస్తుందని అంతా భావించారు. కానీ, ఆ బాధ్యతను ‘రక్షాబంధన్’ తీసుకుందట. అంటే, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ‘లాల్ సింగ్ చద్దా’ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ మెప్పించలేకపోయిందని రివ్యూస్ వస్తున్నాయి. ‘రక్షాబంధన్’ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. ఊపిరి పీల్చుకో బాలీవుడ్ అంటూ భరోసా ఇస్తోంది. ఈ నేపథ్యంలో సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ రెండు చిత్రాలపై ఏం చెబుతారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, ఆయన ఏ సినిమాకు ఎంత రేటింగ్ ఇచ్చారో చూద్దామా. 


ఈ రోజు విడుదలైన రెండు సినిమాల వివరాల్లోకి వెళ్తే.. అమీర్ ఖాన్, అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. పుట్టకతో వచ్చిన వైకల్యాన్ని జయించిన ఒక ఇన్నోసెంట్ కుర్రాడు సైన్యంలోకి ఎలా చేరతాడు. ఆ తర్వాత అతడు దేశం కోసం ఏం చేస్తాడనేది ‘లాల్ సింగ్ చద్దా’లోని కథ. 1994లో టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫారెస్ట్ గంప్‌’ సినిమాకు ఇది రీమేక్. ఇదివరకు అమీర్‌ ఖాన్‌తో కలిసి ‘సీక్రెట్ సూపర్‌స్టార్‌’ (2017) తెరకెక్కించిన అద్వైత్‌ చందన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అమీర్‌ ఖాన్ నిర్మాత. ఇందులో కరీనా కపూర్.. అమీర్ ఖాన్‌కు జోడీగా నటించింది.


‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాకు ఎరిక్‌ రోత్‌, రచయిత అతుల్‌ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు. ఇందులో నాగచైతన్య బోడి బాలరాజు అనే పాత్రలో కనిపిస్తారు. లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అయితే, ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాన్ని ఇండియాలో చాలామంది చూసేశారు. ఈ ప్రభావం ‘లాల్ సింగ్ చద్దా’పై పడొచ్చు. అలాగే, ఈ సినిమా చూసినవారి దీన్ని సేమ్ టు సేమ్ దింపేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరి, తెలుగు ప్రజలకు నచ్చుతుందో లేదో చూడాలి. దీనికి చిరంజీవి సమర్పిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు చాలా పబ్లిసిటీ ఇచ్చారు. 


ఇక ‘రక్షాబంధన్’ సినిమా విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర వహించారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీంతో ఆయన ‘రక్షా బంధన్’ను కూడా అంచనాలకు తగ్గకుండా తీశారని టాక్ వస్తోంది. అన్నా, చెల్లెళ్ల అనుబంధం గురించి ఈ సినిమాలో ఎంత చక్కగా చూపించారట. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.. కడుపుబ్బా నవ్వుకొనే వినోదం, కన్నీళ్లు పెట్టించే భావోద్వేగ సన్నివేశాలు. అక్షయ్‌కు చెల్లెల్లుగా నటించిన సదీయా ఖతీబ్, సహేజ్‌మీన్ కౌర్, దీపికా ఖన్నాలు సైతం చక్కని అభినయంతో ప్రేక్షకుల మనసు దోచేశారట. అక్షయ్ కుమార్‌కు జోడీగా భూమి పెడ్నేకర్ నటించింది. ‘రాఖీ’ నేపథ్యంలో అన్నా చెల్లెల్లు కలిసి చూడదగిన ఫ్యామిలీ మూవీ ఇదని అంటున్నారు.


మరి, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ‘లాల్ సింగ్ చద్దా’, ‘రక్షా బంధన్’ సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారో ఇప్పుడు చూసేద్దాం. ‘లాల్ సింగ్ చద్దా’ తనను చాలా నిరుత్సాహానికి గురిచేసిందని తరణ్ అన్నారు. కేవలం రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారు. ‘‘అమీర్ ఖాన్ కమ్‌బ్యాక్ వాహనానికి మధ్యదారిలో ఇంధనం అయిపోయింది. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సెకండ్ ఆఫ్ పూర్తిగా నిరుత్సాహాన్ని గురిచేస్తుంది. కొన్ని సీన్స్ టెరిఫిక్‌గా ఉంటాయి. కానీ, మొత్తంగా ప్రేక్షకుల ఫైర్‌ మిస్సయ్యింది’’ అని తెలిపారు. 






‘రక్షా బంధన్’ గురించి మాట్లాడుతూ.. ‘రక్షా బంధన్’ సినిమా గుండెను కదిలించిందని తరణ్ చెప్పారు. ‘‘ఈ చిత్రాన్ని మూడున్నర స్టార్స్ ఇచ్చారు. స్ట్రాంగ్ ఎమోషన్స్, ఇంటర్వెల్.. సెకండాఫ్‌లో కదిలించే సన్నివేశాలు ఈ సినిమా పెద్ద ప్లస్’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో ‘రక్షాబంధన్’ ఈ వీకెండ్‌లోదుమ్ముదులిపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్ కుమార్‌కు కూడా ఇది గుడ్‌న్యూసే. 






Also Read: లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
Also Read: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!