Kriti Sanon Post on Adipurush : ఓం రౌత్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించిన 'ఆదిపురుష్' జూన్ 16న శుక్రవారం విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో కొనసాగుతోంది. సినిమాలోని డైలాగ్‌లు, పాత్రలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు సన్నివేశాలు, డైలాగులు తీసివేయాలని, రామాయణాన్ని అపహాస్యం చేశారని ఆరోపిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. ఈ ఎదురుదెబ్బల మధ్య, హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రంలో జానకి పాత్రలో నటించిన కృతి సనన్..'చీర్స్, క్లాప్స్'పై దృష్టి పెడుతూ ఓ పోస్ట్‌ను పంచుకున్నారు.


కృతి సనన్ పోస్ట్


ఆదిపురుష్‌లో ప్రభాస్... రాఘవ్, సైఫ్ అలీఖాన్ లంకేష్, కృతి జానకి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృతి 'ఆదిపురుష్‌'పై ప్రేక్షకుల స్పందనను చూపే వీడియోల సిరీస్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పంచుకుంది. థియేటర్లలో ప్లే అవుతోన్న ఈ క్లిప్‌లో పెద్ద స్క్రీన్‌పై కృతి, ప్రభాస్, సైఫ్‌లను వీక్షిస్తున్నప్పుడు ప్రజలు ఉల్లాసంగా, చప్పట్లు కొడుతూ కనిపించారు.






ఈ పోస్టుపై చాలా మంది 'ఆదిపురుష్' చిత్రం పట్ల తమ నిరాశను వ్యక్తం చేశారు. అందులో ఒక వ్యక్తి కృతి పోస్ట్‌పై నెగటివ్‌గా రిప్లై ఇచ్చాడు. "డోంట్ వర్రీ గైస్. యే ఇన్హి కే లాగ్ హై (థియేటర్‌లలో చప్పట్లు కొట్టి, ఉత్సాహపరిచే వారు వారి స్వంత వ్యక్తులు)" అని రాసుకొచ్చారు. "అచ్చి తరాహ్ సునో, వో తలియాన్ నహీ గలియాన్ హై (జాగ్రత్తగా వినండి, అవి చప్పట్లు కాదు, తిట్లు)" అంటూ ఇంకొకరు చమత్కారంగా కామెంట్ చేశారు. "డిస్ లైక్ బటన్ ఎక్కడ ఉంది?" అని మరొకరు అనగా.. “ఆదిపురుష్ సినిమాను ఎవరు బహిష్కరించాలని అనుకుంటున్నారు?” అని ఇంకో ఒక వ్యక్తి అడిగాడు. "యానిమేషన్ రామాయణం దీని కంటే గొప్పది" అంటూ మరొక నెటిజన్ సెటైరికల్ కామెంట్ చేశారు.


వివాదంలో ఆదిపురుష్


గతేడాది అక్టోబర్‌లో 'ఆదిపురుష్' టీజర్‌ను విడుదల చేయడంతో.. అప్పట్నుంచి వార్తల్లోకెక్కడం ప్రారంభించింది. ఈ టీజర్ పైనా ఎనలేని విమర్శనాత్మక కామెంట్లు వచ్చాయి. సన్నివేశాలన్నీ కార్టూన్ లాంటి గ్రాఫిక్స్ లాగా ఉన్నాయని చాలా మంది వెక్కిరించారు. ఇక ఈ సినిమా గత వారం విడుదలైనప్పటి  నుంచి మళ్లీ అదే తంతు కొనసాగింది. మూవీలోని పాత్రల వర్ణనను సవాలు చేస్తూ చిత్రానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు కూడా జరిగాయి.


నేపాల్‌లో కొందరు 'ఆదిపురుష్‌'లో జానకిని భారతీయ పుత్రిక అనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా ఫేస్‌బుక్ పోస్ట్‌ చేశారు. నగరంలోని థియేటర్‌లలో అన్ని బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. ఆ డైలాగ్‌ని తొలగించాల్సిందిగా ఆదిపురుష్ మేకర్స్‌ని కోరారు. పోఖారా మెట్రోపాలిటన్ సిటీ మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.


Read Also : Chiranjeevi : లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం - మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరంజీవి