మురారీని తప్పుగా అర్థం చేసుకున్నందుకు కృష్ణ పశ్చాత్తాపంతో గుడి మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతుంది. గుడి పూజారి మురారీకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో పరుగున వస్తాడు. ఎంత చెప్పినా కూడా వినకుండా కృష్ణ మోకాళ్ళ మీద ఎక్కుతూనే ఉంటుంది. ఇంత కఠినమైన మొక్కు ఎందుకు మొక్కుకున్నావని ఆగమని అడుగుతాడు. అప్పుడే ఒకామేకి మురారీ చెయ్యి తగిలి పూజ కోసం తెచ్చిన కాళ్ళు మురారీ కాళ్ళ దగ్గర పడతాయి. కృష్ణ బాధగా మురారీ కాళ్ళకి దణ్ణం పెడుతుంది. తర్వాత తనని పైకి లేపుతాడు. ఇద్దరూ అమ్మవారి దగ్గరకి వెళ్ళి దణ్ణం పెట్టుకుని హారతి తీసుకుంటారు. మురారీ పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తున్నట్టుగా భవానీకి వినిపిస్తుంది. కళ్ళు తిరిగి సోఫాలో పడబోతుంది. అది చూసిన ముకుంద మురారీని పెద్దత్తయ్య దూరం చేసుకోలేకపోతున్నారని అనుకుంటుంది. ఒంటరిగా ఉండాలని ఉందని భవానీ బాధపడుతుంది.


Also Read: భార్యని చూసి డిసప్పాయింట్ అయిన యష్- మాళవికకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వేద


ముకుంద: మీ మనసు బాగోకపోవడానికి అన్నింటికీ కారణం కృష్ణ. మీలాంటి వాళ్ళందరి కళ్ళు గప్పి మురారీని మీకు వ్యతిరేకంగా మార్చేసింది


భవానీ: నీకోక మాట చెప్పనా తప్పుడు మాటలు చెప్పి విని చెడిపోయే వాళ్ళ జాబితాలో చేర్చకు


ముకుంద: మీ ఎదురుగా ఉంటూ మీమాట వింటున్నట్టు నటిస్తూ మురారీ చేయాల్సింది చేశాడు అది నిజమా అబద్ధమా? నలుగురికీ మాట ఇచ్చి నాలుగు స్తంభాల ఆట ఆడి నందిని మీకు దూరం చేశాడు. కృష్ణ వల్ల ఈ ఇంట్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. మీకు మనశ్శాంతి కరువైంది. అందుకే తనని శాశ్వతంగా ఇంటి నుంచి పంపించేయండి. కృష్ణ వల్ల మురారీని మీరు ఎందుకు దూరం చేసుకుంటున్నారు. మీకు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుందంటే కృష్ణ అందరినీ తనవైపుకి ఎలా తిప్పుకుందో తెలుస్తుందా? దీనికి శిక్ష కృష్ణని ఇంటి నుంచి బహిష్కరించడమే


భవానీ: కృష్ణ ఉండటం వల్ల నీకు ఏంటి ప్రాబ్లం. నను విసిగించకుండా కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు వెళ్లిపో


కృష్ణ, మురారీ ఒక రెస్టారెంట్ కి వెళతారు. ఏం తింటావని అడిగితే మీకు ఇష్టమైందే తింటానని ప్రేమగా చెప్తుంది. ఆ మాటకి ఆశ్చర్యపోతాడు. అవును మీకు ఇష్టమైనదే నాకు ఇష్టమని చెప్తుంది. మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎందుకు ఎక్కావని అడుగుతాడు. కృష్ణ అసలు విషయం చెప్పకుండా తింగరగా వంకరగా సమాధానాలు చెప్తుంది. ఆలస్యంగా అయినా ఒక విషయం తెలుసుకున్నానని అంటుంది. ఇవాళ చాలా వింతగా మాట్లాడుతున్నావ్ ఏమైందని అడుగుతాడు.


Also Read: జానకి బూజు దులుపిన జెస్సి- రామ మీద మరో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఎస్సై


మబ్బులు వీడిపోయి మనసు నిశ్చలంగా మారిందని కవిత్వం చెప్పేస్తుంది. ఇద్దరికీ సర్వెంట్ కపుల్ స్వీట్ ఇచ్చి ఎంజాయ్ అనేసి వెళ్ళిపోతాడు. కృష్ణ ప్రేమగా మనస్పూర్తిగా మురారీకి తినిపిస్తుంది. ఆ సీన్ చాలా క్యూట్ గా ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు.