నందినికి గౌతమ్ అన్నం తినిపించడం కోసం ట్రై చేస్తాడు. కానీ కృష్ణ కావాలని ఇంట్లో అందరూ తనని ఏమంటున్నారోనని నందిని బాధపడుతుంది. నాకు తెలుసు కృష్ణమ్మ మా పెళ్లి వల్ల నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలిసే దూరం ఉండమని చెప్పానని బాధపడతాడు. అన్నం తింటే కృష్ణ దగ్గరకి తీసుకువెళ్తానని చెప్పి తినిపిస్తాడు. భవానీ, మురారీ జరిగింది తలుచుకుని చాలా బాధపడతారు. ఆదర్శ్ మిస్ అయిన విషయం, మురారీ కృష్ణని పెళ్లి చేసుకోవడం, నందిని, గౌతమ్ పెళ్లి జరగడం తలచుకుని భవానీ మనసులోనే మధనపడుతుంది. నాకు ఇచ్చిన మాట వల్ల పెద్దమ్మకి ఇచ్చిన మాట తప్పి ఇంత పెద్ద కుటుంబం నుంచి దూరం అయ్యారు. ఏదో ఒకటి చేసి పెద్దత్తయ్య మనసు మార్చాలని కృష్ణ తన దగ్గరకి వెళ్తుంది.


కృష్ణ: ఇది ఒక ఉమ్మడి కుటుంబం అందరినీ ప్రేమగా చూసుకునే కుటుంబం. వీళ్ళంతా కలిసి కట్టుగా ఉండటానికి కారణం మీరు. అలాంటి కుటుంబంలోకి నేను అడుగుపెట్టాను నాకు కుటుంబమే లేదు అందుకే ఆ విలువ తెలియలేదు ఏమో. అందరూ ఇష్టపడే ఏసీపీ సర్ తో ఎవరు మాట్లాడటం లేదు. ముఖ్యంగా మీరు మాట్లాడటం లేదు. ఆయన మౌనంగా ఉండటం చూడలేకపోతున్నా. ఇందులో ఆయన తప్పేమీ లేదు నాకు శిక్ష వేయండి. కావాలంటే ఇంట్లో నుంచి పంపించేయండి. కానీ దయచేసి ఆయనతో మాట్లాడండి


Also Read: మనసుల్ని మెలిపెట్టేస్తున్న యష్ గుండె లోతుల్లోని బాధ- వేదకి నిజం చెప్పిన విన్నీ


భవానీ: ముకుంద.. అని గట్టిగా అరుస్తుంది. వెంటనే కృష్ణ తలకి గన్ గురి పెడుతుంది. అరుపు విని అందరూ బయటకి వస్తారు.


కృష్ణ: నేను బయటదాన్ని చంపేసిన ఎవరూ అడిగే వాళ్ళు లేరు పోతే ఏడవటానికి ఎవరు లేరు. కానీ ఆ మరుక్షణమే ఏసీపీ సర్ ని క్షమిస్తానంటే ఆ పని చేయండి లేదంటే మీకు నన్ను చంపే హక్కు లేదు


ముకుంద: మిమ్మల్ని ఎదిరిస్తే ఇంత పెద్ద శిక్ష వేస్తారా ప్రాణం తీస్తారా? ఇక్కడ ఇంతమంది నిలబడ్డారు ఎవరూ మాట్లాడరు ఏంటి? అత్తయ్య కృష్ణ నందిని మీకు దూరం చేసి ఉండవచ్చు. కానీ తనకి న్యాయం చేసింది. మురారీ కూడా తనకి మంచి దారి చూపించాడు. వీలైతే మీరు వాళ్ళని క్షమించండి అంతే కానీ ప్రాణాలు తీసే హక్కు లేదు క్షమించండి ఇలా మాట్లాడినందుకు


భవానీ: నా కుటుంబంలో చీలిక ఏర్పడింది వీటన్నింటికీ కారణం ఈ అమ్మాయి. నా కూతుర్ని నాకు దూరం చేసింది. ఈ పెద్దమ్మ గీసిన గీత దాటని వాడిని కూడా గీత దాటించింది. అలాంటి దాన్ని నేను క్షమించను


రేవతి: ఇటువంటి కొడుకుని కన్నందుకు, కోడలిని సమర్థించినందుకు నన్ను చంపండి


కృష్ణ: నా భర్త ఏ అపరాధం చేయలేదు ఎవరినీ మోసం చేయలేదు


ట్రిగ్గర్ నొక్కే టైమ్ కి కృష్ణని పక్కకి లాగి మురారీ నిలబడతాడు.


మురారీ: నీ వల్ల తప్పు జరగలేదు కృష్ణ. పెద్దమ్మకి ఇచ్చిన మాట తప్పింది నేను. మా పెద్దమ్మ వ తల్లి కన్నబిడ్డని చంపగలిగేంత కఠినమైనది అయితే ఆ నేరం నాతోనే మొదలు పెడుతుంది నన్నే ముందు కాల్చేస్తుంది అనగానే గన్ కిందకు దించుతుంది.


Also Read: జానకి నెత్తిన మరో పిడుగు- జ్ఞానంబ ఇంట్లో ఇక ప్రళయమే


ఇంట్లో అందరూ జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటారు. నందిని పెళ్లి విషయంలో మాట తీసుకుని అందరికీ దూరం అయ్యారని కృష్ణ బాధపడుతుంది. నీది ఎంత మంచి మనసు నన్ను ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించి నా మీద ఒత్తిడి తీసుకురాలేదని మెచ్చుకుంటాడు. నందిని కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంది త్వరలోనే తిరిగి మామూలు మనిషి అవుతుందని కృష్ణ ధైర్యం చెప్తుంది.