కళ్ళకు గంతలు ఉన్నా కూడా యష్ వేదని కరెక్ట్ గా పట్టుకుంటాడు. మీరు సూపర్, ఇంతకముందు ఇలాంటి గేమ్స్ చాలా పెట్టాం కానీ ఎవరూ వాళ్ళ భార్యని గుర్తు పట్టలేదు. కానీ మీరు సింపుల్ గా కనిపెట్టేశారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది మీకు మీ భార్య అంటే ఎంతో ఇష్టమని యాంకర్ అంటుంది. మనది ఎన్నెన్నో జన్మలబంధమని వేద చాలా చక్కగా చెప్తుంది. యష్ వేదకి ఐలవ్యు చెప్పడానికి వీల్లేదు తనకి ఆ సంతోషం దక్కడానికి వీల్లేదని మాళవిక అనుకుంటుంది. ఒకప్పుడు యష్ అంటే కోపం బాధ తప్ప ఏమి ఉండేవి కావు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది నా లైఫ్ లోకి వేద వచ్చింది ఖుషికి అమ్మ వచ్చింది. నాకు చాలా కోపం నేను ఏమన్నా భరించేది. లైఫ్ లో కిందపడిపోయిన నన్ను పైకి లేపింది. వేదనే నా సంతోషం, తనే నా సర్వస్వం. వేద లేకపోతే యష్ లేడు. ఐలవ్యూ వేద. ఐలవ్యూ సో మచ్ అని చెప్పినట్టు ఊహించుకుంటాడు.


Also Read: జానకి నెత్తిన మరో పిడుగు- జ్ఞానంబ ఇంట్లో ఇక ప్రళయమే


అక్కడ ఉన్న అందరూ చెప్పమని ప్రపోజ్ చేయమని అడుగుతారు. నువ్వు నన్ను మర్చిపోవాలని మనసులోనే బాధపడతాడు. ఏమి మాట్లాడకుండా ఉండటంతో మాళవిక వచ్చి యశోధర్ వేదకి ఐలవ్యూ చెప్పడం ఇంపాజిబుల్. తన ఫస్ట్ వైఫ్ నేను, తన ఫస్ట్ లవ్ నేను. తను నన్ను మర్చిపోలేకపోతున్నాడు. అందుకే వేదకి ఐలవ్యూ చెప్పలేకపోతున్నాడు. యశోధర్ భార్య స్థానం మాత్రం ఎప్పటికీ నాదే. ఈ వేద ఒక అద్దె అమ్మ. అంతకమించి వీళ్లిద్దరి మధ్య లవ్, రిలేషన్ షిప్ లేదు. నా ముందు వేద జస్ట్ నథింగ్ అని అంటుంది. స్టాపిడ్ ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? కానీ నా గుండెల్లో నీగురించి ఇప్పటికీ ఫీలింగ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా ఐ హేట్ యూ అనేసి వెళ్ళిపోతాడు.


వేద: విన్నావా వినిపించిందా


మాళవిక: కానీ నీకు ఐలవ్యూ చెప్పలేదు కదా


వేద: ఆయన గుండెల నిండా ప్రేమ ఉంది. ఆ విషయం మైక్ లో చెప్పాల్సిన పని లేదు. నా పేరుకు ముందు భర్త ఇంటి పేరు ఉంది పేరు చివర ఆయన పేరు ఉంది. ఐయామ్ వైఫ్ ఆఫ్ యశోధర్


ఖుషి డ్రాయింగ్ గీస్తూ ఉంటే యష్ వచ్చి పలకరిస్తాడు. పది రోజులు డాడీ ఉండదని దిగులు పడుతున్నావా అని అంటాడు. లేదు నీ గురించి నిన్ను నిద్రలేపి నీకు అన్నీ చేసేది మమ్మీనే కదా. నువ్వు ఇలా చెప్తున్నావ్ కానీ మమ్మీ లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేవు. మమ్మీ మీద బెంగ పెట్టుకుని రెండు రోజుల్లో వెనక్కి వచ్చేస్తావ్. అమ్మ అంటే నీకు ప్రాణం కానీ నీకు ఆ విషయం తెలియడం లేదని అంటుంది.


Also Read: దివ్యకి చుక్కలు చూపిస్తున్న రాజ్యలక్ష్మి- తులసి వాళ్ళని అవమానించి పంపించమన్న లాస్య


యష్: అవును తల్లీ నా ప్రాణమే మీ మమ్మీ, నా ఊపిరి మీ మమ్మీ. తను లేకపోతే నేను లేనని మనసులో కుమిలిపోతాడు. ఈ మాటలన్నీ వేద వింటుంది. ఎంత మంచి జీవితం ఇచ్చావని దేవుడికి వేద మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంటుంది. యష్ అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. బట్టలన్నీ సర్దుతుంటే మీరు వెళ్ళేది పది రోజులే కదా నా దగ్గర నిజం ఏం దాచి పెట్టడం లేదు కదా అని అడుగుతుంది. మీరు ఎక్కువ రోజులు ఉండేటట్టు అయితే నేను వస్తాను మీరు లేకుండా నేను ఉండలేనని తన మనసులో బాధ పంచుకుంటుంది. నా చెయ్యి ఎప్పటికీ మీ చేతిలోనే ఉండాలి. నా చెయ్యి ఎప్పటికీ వదలొద్దని వేద భర్త చేతిని పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.