Krishna Health Updates Live: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, విషమంగా కృష్ణ ఆరోగ్యం - హాస్పిటల్‌లోనే ఘట్టమనేని కుటుంబ సభ్యులు

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ABP DesamLast Updated: 14 Nov 2022 06:59 PM

Background

సూపర్ స్టార్ కృష్ణ (Krishna Ghattamaneni) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సోమవారం ఉదయం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్నారు. దాంతో ఘట్టమనేని, మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ కొన్ని రోజులుగా కృష్ణ...More

మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, పరిస్థితి ఇంకా విషమయంగానే ఉంది: డాక్టర్లు

తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారని, ఉదయం నుంచి ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారని వెల్లడించారు. 8 మంది డాక్టర్లు ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కృష్ణ కుటుంబ సభ్యులు ప్రైవేట్ రూమ్‌లో ఉన్నారని, మధ్య మధ్యలో ఆయన్ని చూసి వెళ్తున్నారన్నారని డాక్టర్ గురునాథ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంకా క్రిటికల్ స్టేజ్‌లోనే ఉన్నారని తప్పా.. ఇంకా ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు. కృష్ణ మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. తమ హాస్పిటల్‌లో దగ్గర అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.