మలయాళ నటి KPAC లలిత (KPAC Lalitha) ఇకలేరు. మంగళవారం రాత్రి కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత ఏడాది డిసెంబర్‌లో కాలేయ సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యానికి తోడు వయసు రీత్యా వచ్చిన సమస్యల కారణంగా ఆమె మరణించినట్టు (KPAC Lalitha passed away) తెలుస్తోంది. మలయాళంలో 500లకు పైగా సినిమాల్లో నటించారు. ఆవిడ అసలు పేరు KPAC లలిత కాదు, మహేశ్వరి (KAPC Lalitha Original Name). మరి, KPAC లలితగా ఎలా మారారు అంటే...
సినిమాల్లోకి ప్రవేశించక ముందు... మహేశ్వరి థియేటర్ ఆర్టిస్ట్. కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ (Kerala People’s Arts Club - KPAC)లో కెరీర్ స్టార్ట్ చేశారు. అందులో స్క్రీన్ నేమ్, ఆవిడ పేరుగా మారింది. నటిగా 1969లో 'కూట్టుకుడుంబమ్'తో సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన ఆవిడ, 2010 వరకూ ఆమె పలు సినిమాలు చేశారు. తల్లిగా, చెల్లిగా, కుమార్తెగా విభిన్న పాత్రలు పోషించారు. ఆమె కామెడీ టైమింగ్ అద్భుతమని మాలీవుడ్ చెబుతుంది. రెండుసార్లు ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం, నాలుగు కేరళ రాష్ట్ర అవార్డులు, ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్న ఘనత లలిత సొంతం.
లలిత భర్త, మలయాళ దర్శకుడు భరతన్ 1998లో మరణించారు. లలిత జాతీయ పురస్కారం అందుకున్న 'అమరన్' చిత్రానికి ఆమె భర్త భరతనే దర్శకుడు. వీరికి ఓ కుమారుడు. అతడి పేరు సిద్ధార్థ్. నటుడు, దర్శకుడు కూడా! భరతన్ - లలిత దంపతులకు ఓ కుమార్తె శ్రీకుట్టి ఇచ్చారు. KPAC లలిత మరణం పట్ల పలువురు మలయాళ సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: 'శ్రీ శ్రీ రాజావారు'గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ బావమరిది
Also Read: సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి, ఇందులో చిన్న ట్విస్ట్ ఉందండోయ్!