Farzi web series: ‘ఫర్జీ’కి ప్రేక్షకులు ఫిదా - ఈ సీరిస్‌కు షాహీద్, విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది ‘ఫర్జీ’ వెబ్ సిరీస్. నకిలీ నోట్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Continues below advertisement

షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. ప్రముఖ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, కే కే మీనన్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ లో నటనకు గాను, ఒక్కో స్టార్ భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నారు. ఎవరు ఎంత పారితోషకం తీసుకున్నారంటే..

Continues below advertisement

రాశీ ఖన్నా

‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో రాశీ ఖన్నా మేఘా అనే ఆర్బీఐ అధికారి పాత్రలో నటించింది. దేశంలో నకిలీ నోట్ల సమస్యను పరిష్కరించే అంకితభావం, నిజాయితీ కలిగిన అధికారిగా చక్కటి నటనక కనబరించింది. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ‘పర్జీ’లో నటించేందుకు రూ.1.5 కోట్లు తీసుకుంది. రాశీ ఖన్నా చివరి సారిగా అజయ్ దేవగన్, ఈషా డియోల్ నటించిన ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌’లో నటించింది.

కే కే మీనన్

ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్ మన్సూర్ అనే నకిలీ నోట్ల చెలామణి వ్యాపారిగా నటించాడు. పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న నకిలీ నోట్ల వ్యాపారిగా ఆ పాత్రలో జీవించాడు. తను అనుకున్నది చేసేందుకు దేనికైనా వెనుకాడని క్రూరమైన వ్యక్తిగా ఇందులో కనిపించాడు. తన పాత్రకు గాను కే కే మీనన్ రూ. 2.5 కోట్ల పారితోషకం అందుకున్నాడు. కే కే చివరిసారిగా నీరజ్ పాండే దర్శకత్వం వహించిన స్పెషల్ ఆప్స్ ‘1.5: ది హిమ్మత్ స్టోరీ’లో కనిపించాడు.

విజయ్ సేతుపతి

‘ఫర్జీ’లో సౌత్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి పోలీసు అధికారి పాత్రలో నటించాడు. ఈ సిరీస్ తోనే తొలిసారి ఓటీటీలోకి అడుగు పెట్టాడు. తన వివాహ జీవితాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించే నిబద్ధత గల అధికారిగా అదరగొట్టాడు. ఈ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ కోసం అతను ఏకంగా రూ. 7 కోట్లు అందుకున్నాడు. విజయ్ సేతుపతి  షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం – ‘జవాన్‌’లో నటించబోతున్నాడు.

షాహిద్ కపూర్

‘ఫర్జీ’ వెబ్ సిరీస్ తోనే షాహిద్ కపూర్ సైతం ఓటీటీలోకి అడుగు పెట్టాడు. తన మొదట OTT అరంగేట్రం కోసం రూ.35 కోట్లకు పైగా డిమాండ్ చేశాడట.  అయితే, తను నటించిన ‘జెర్సీ’ బాక్సాఫీస్ వద్ద విఫలమైన నేపథ్యంలో సుమారు రూ.30 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. షాహిద్ త్వరలో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నా ‘బ్లడీ డాడీ’లో కనిపించనున్నాడు.   

Read Also: మోహన్‌లాల్ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడి మ్యూజిక్

Continues below advertisement
Sponsored Links by Taboola