Billa Ranga Basha Concept Video Released: కన్నడ సూపర్ స్టార్ బాద్ షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారి కాంబోలో మరో క్రేజీ మూవీ తెరకెక్కబోతోంది. ఇప్పటికే వీళ్లిద్దరు కలిసి చేసిన 'విక్రాంత్ రోణ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మరోసారి వీరిద్దరు కలిసి 'బిల్లా రంగ బాషా‘ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కనుంది. సుదీప్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా మూవీ కాన్సెప్ట్ వీడియోతో పాటు లోగోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
ప్రేక్షకులను కట్టిపడేస్తున్న కాన్సెప్ట్ వీడియో
‘బిల్లా రంగా భాషా’ సినిమాకు సంబంధించి విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోలో క్రీ.శ. 2209లో జరిగే భవిష్యత్తును సూచిస్తోంది. ఇందులో అమెరికాలోని ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పారిస్ లోని ఈఫిల్ టవర్, ఆగ్రాలోని తాజ్ మహల్ ధ్వంసం కావడంతో పాటు, ఒక వ్యక్తి ఈ దేశాలన్నింటినీ జయించినట్లు ప్రజెంట్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు, వాతావరణాలను యాడ్ చేశారు. అనూప్ భండారి ఎక్సయిటింగ్ డీటెయిల్స్ తో విజువల్ ప్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు.
నాపై పెద్ద బాధ్యత ఉంది- అనూప్ భండారి
‘బిల్లా రంగా భాషా’ సినిమాకు సంబంధించి దర్శకుడు అనూప్ భండారి కీలక విషయాలు వెల్లడించారు. “విక్రాంత్ రోణ’ తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి నాతో కలిసి పనిచేయాలనుకున్నారు. నేను ఆయనను ‘హనుమాన్’ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కలిశాను. నా తర్వాత చిత్రం కూడా సుదీప్ తోనే ఉంటుందని చెప్పాను. అప్పుడే ‘బిల్లా రంగ బాషా’ కథను చెప్పాను. ఆయన చాలా థ్రిల్ గా ఫీలయ్యారు. వారు కూడా తమ నెక్ట్స్ ప్రాజెక్టుకును పెద్ద ఎత్తున నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘బిల్లా రంగ బాషా’ పర్ఫెక్ట్ అనుకున్నారు. కిచ్చా సుదీప్ తో మరో సినిమా చేయడం పట్ల అనూప్ సంతోషం వ్యక్తం చేశారు. “సుదీప్ సర్‌తో కలిసి పని చేయడం గొప్పగా అనిపిస్తుంది. ప్రజలు ఇప్పటికే ‘విక్రాంత్ రోణ’ను ఇష్టపడ్డారు. ఈ సినిమాను ఇష్టపడతారని భావిస్తున్నాను. ఈ సినిమా నా భుజాలపై పెద్ద బాధ్యత పెట్టినట్లు భావిస్తున్నాను. అందరి అంచనాలను అందుకునే ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
త్వరలో షూటింగ్ ప్రారంభం
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాతలు వెల్లడించారు. “కిచ్చా సుదీప్ తో అనూప్ భండారి సినిమా చేస్తున్నారని తెలిసి ఎగ్జైట్ అయ్యాం. ‘విక్రాంత్ రోణ’ తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. ‘బిల్లా రంగ బాషా’ కథ విన్నప్పుడు మేమే నిర్మించాలి అనుకున్నాం. కిచ్చా సుదీప్ తో సినిమా చేయడం గొప్ప అవకాశం. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అన్నారు. ‘బిల్లా రంగ బాషా’ సినిమా పాన్ ఇండియా సినిమాలగా అన్ని ప్రధాన భారతీయ భాషలలో నిర్మాణం జరుపుకోనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Read Also: దేవర నుంచి డావుడి - ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్