కీర్తీ సురేష్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆమెకు కరోనా తగ్గింది. అయితే... లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే ముఖంలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇంకా నీరసంతో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆరు రోజుల క్రితం తనకు కరోనా సోకినట్టు కీర్తీ సురేష్ స్వయంగా వెల్లడించారు. అప్పుడు మైల్డ్ అని చెప్పారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. అయితే... ఈ రోజు ఫొటోలు చూస్తే... మైల్డ్ కాదు, స్ట్రాంగ్ అన్నట్టు ఉన్నాయి.





"ఈ రోజుల్లో నెగెటివ్ అంటే పాజిటివ్. మీ ప్రేమ, ప్రార్థనలకు సదా కృతజ్ఞురాలిని. మీరందరూ సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను" అని ఆమె పోస్ట్ చేశారు. కీర్తీ సురేష్ ముఖంలో ఎప్పుడూ ఓ చిరునవ్వు ఉంటుంది. కరోనా తగ్గిందంటూ పోస్ట్ చేసిన ఫొటోల్లో కూడా చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. అయితే... వెలుగు బదులు నీరసం కనిపించింది. కరోనా కాబట్టి ఆ మాత్రం ఉంటుందని సరి పెట్టుకోవాలి. నీరసం కంటే కరోనా తగ్గడం ఆమె అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. 






Also Read: ధనుష్.. ఐశ్వర్య కంటే చిన్నోడు, హడావిడిగా పెళ్లి.. వీరిది చాలా చిత్రమైన ప్రేమ!
Also Read: ధ‌నుష్ కంటే ముందు ఆ హీరోతో ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ ప్రేమ‌లో ఉందా?
Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి