బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి రెడీ అయ్యారు. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని అఫీషియల్ గా మాత్రం చెప్పలేదు. కత్రినా, విక్కీ సన్నిహిత వర్గాల ద్వారా ఈ విషయం బయటకొచ్చింది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు రాజస్థాన్ కు చేరుకున్నారు. అక్కడే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్ లో వీరి వివాహం జరగబోతుంది. రీసెంట్ వీరి పెళ్లికి సంబంధించిన ఓ వెల్కమ్ నోట్ లీకైంది. అందులో అతిథులను పెళ్లి వేడుకకు మొబైల్ ఫోన్స్ తీసుకురావొద్దని రిక్వెస్ట్ చేశారు.
ఇప్పుడేమో పెళ్లి కార్డ్ లీకైంది. అందులో పెళ్లి డేట్ డిసెంబర్ 9 అని ఉంది. అలానే వెన్యూ ఇతర డీటైల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులంతా ఈ పెళ్లి కార్డ్ ను బాగా సర్క్యూలేట్ చేస్తున్నారు. డిసెంబర్ 7,8 తేదీల్లో సంగీత్, మెహందీ వేడుకలు జరిగాయి. రేపు పెళ్లి బంధంతో విక్కీ-కత్రినా ఒక్కటి కానున్నారు. గతవారంలోనే ఈ జంట ముంబై కోర్ట్ మ్యారేజ్ చేసుకుంది.
ఇక ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి అగ్ర సెలబ్రిటీలతో పాటు కొందరు రాజకీయనాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుకలకు దాదాపుగా 120 మంది అతిథులు రాబోతున్నట్టు సమాచారం. అతిథుల కోసం స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, ముంబై, ఢిల్లీ, చండీగఢ్.. ఇలా చాలా ప్రాంతాల నుంచి కూరగాయలు, మసాలాలు, ఇతర దినుసులు, స్వీట్స్ లారీల కొద్దీ తెప్పించారట. దేశీ వంటకాలతో పాటు విదేశీ వంటకాలు కూడా ఉంటాయట.
Also Read:బన్నీకి డబ్బింగ్ చెబుతోన్న బాలీవుడ్ హీరో..
Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి