Karthika Deepam October 8th Episode 1478 (కార్తీకదీపం అక్టోబరు 8 ఎపిసోడ్)

నేత్రదాన శిబిరంలో ఫామ్ నింపుతూ కార్తీక్ పేరు పక్కన వైఫ్ అని ఉన్నదగ్గర మోనిత తన పేరు రాయబోతుండగా దీప ఎంట్రీ ఇస్తుంది. దీపా నువ్వేంటి ఇక్కడ అని కార్తీక్ అడిగితే..మీరేంటి ఇక్కడ మీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం, నేత్రదానం శిబిరం ఏర్పాటు చేశాను అన్నాకదా వస్తానని చెప్పారు కదా అంటుంది దీప. నెమ్మదిగా అక్కడి నుంచి కార్తీక్ ను తీసుకుని వెళ్లిపోతుంది మోనిత. సగం ఫిల్ చేసిన ఫామ్ దీప డాక్టర్ అన్నయ్య చూస్తాడు...మోనిత ఫామ్ పై కూడా భర్త ప్లేస్ లో కార్తీక్ ని రాయలేకపోయిందంటాడు.. 

మోనిత, కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోగానే శౌర్య, చంద్రమ్మ వస్తారు. నేత్రదానం చేశావా అంటే చేశానని కవర్ చేస్తాడు ఇంద్రుడు..నాకు నమ్మకం లేదని శౌర్య అనడంతో పదమ్మా అని చంద్రమ్మ తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడేం చేద్దాం అన్నయ్యా దీప అంటే చూద్దాం అమ్మా అంటాడు. మోనిత తన ఫ్రెండ్ ఇంటికి వెళతారు. మన ఊరిలో ఉత్సవాలు చూసితీరాల్సిందే అని కావేరి అనే ఆమె అంటే..అందుకే చూద్దాం అని వచ్చాం అంటుంది మోనిత. కార్తీక్: మన ఊరు అయితే ప్రతీసారీ చూస్తాం కదా..కొత్తగా మాట్లాడుతున్నావేంటికావేరి: నీకు గుర్తులేదు కాబట్టి కాబట్టి మళ్లీ మళ్లీ చూడాలని చెబుతున్నా అని కవర్ చేస్తుంది. కార్తీక్: మొన్న మనం ఇక్కడకు వచ్చినప్పుడు ఊరంతా చుట్టూ మూగారు కదా..మరి ఈసారి ఏంటి కనీసం ఒక్కరు కూడా పలకరించలేదు..మోనిత:అందరూ పండుగ హడావుడిలో ఉన్నారు కదా అని కవర్ చేస్తుంది.. ఇంతలో పనివాళ్లు ఇద్దరు వచ్చి..నమస్కారం కార్తీక్ బాబు, మోనితమ్మ బావున్నావా అని యాక్షన్ చేస్తారు... మా పిల్లల్ని పనిలోకి పంపిస్తుంటే మీరే డబ్బులు కట్టి వాళ్లని బడికి పంపించారు కదా మీ మేలు జన్మలో మర్చిపోలేం అంటారు. ఆ మాటలు విన్న కార్తీక్ కి గతంలో శౌర్య చదువుకి ఖర్చుచేస్తానన్న మాటలు గుర్తొస్తాయి. మోనిత:ఎక్కువ ఆలోచించవద్దు కార్తీక్..నర్సయ్య వాళ్ల పిల్లల్ని చదివిస్తానన్నావ్ కదా..అదే గుర్తొచ్చింది ఎక్కువ ఆలోచించకుకార్తీక్:నువ్వేదో చెబుతావ్ కానీ నాకు అది గుర్తురాదు..కానీ నాకు ఇంకేదో గుర్తొస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు..మోనిత: నమ్మించడానికి ఏదో ప్రయత్నం చేస్తే ఇంకేదో గుర్తొస్తోంది అనుకుంటుంది... ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించిన కావేరి...బయటకు తీసుకెళ్లమని చెబుతుంది...

Also Read: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

కార్తీకదీపంలో రాజ్యలక్ష్మి అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. డాక్టర్ అన్నయ్య వాళ్ల పిన్ని పాత్రలో....దీప వాళ్లు ఆమె ఇంట్లో అడుగుపెడతారు. దీపని చూసిన రాజ్యలక్ష్మి..నీ గురించి వాడు నాకు చెప్పాడంటుంది.. ఓ ఆడపిల్ల జీవితం నిలబడుతుంది అంటే సాయం చేయకుండా ఎలా ఉంటాం అన్న రాజ్యలక్ష్మి..అసలేంటి నీ సమస్య అని అడుగుతుంది. మొత్తం జరిగినదంతాచెబుతుంది దీప. రాజ్యలక్ష్మి: మా ఊరివాళ్లు ఇలా చేయరు..దీప: నేను చెప్పేది నిజం..నా ఊరికి నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు..మీరే నాకు సాయం చేయాలి..రాజ్యలక్ష్మి: ఇప్పుడీ ఉత్సవాల సమయంలో ఈ విషయం మాట్లాడటం ఎందుకు పండుగ అయ్యాక చేద్దాం. దీప అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగేయడం మంచిందిడాక్టర్ అమ్మ: ఆ అమ్మాయి చాలా మంచిది..నీకు మాటరాదు..రాజ్యలక్ష్మి: ప్రేమలేంటో..ప్రేమించిన వాడు దక్కకపోతే వెంటపడడం ఏంటో అర్థంకాదు..నువ్వే మెరుగు ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఏకంగా పెళ్లి చేసుకోవడమే మానేశావు అంటుంది...

మరోవైపు కార్తీక్, మోనిత పండుగ ఏర్పాట్లన్నీ చూస్తుంటారు... మోనిత ఏర్పాటు చేసిన మనుషులు వీళ్లని పలకరిస్తుంటారు.  ఇప్పటికైనా అనుమానం తీరిందా కార్తీక్..ప్రతి దసరాకి ఇక్కడికే వస్తుంటాం అంటుంది మోనిత. దీపది కూడా ఇదే ఊరు కదా అని కార్తీక్ అడగడంతో మోనిత ఫైర్ అవుతుంది.కార్తీక్: వంటలక్క ఇల్లెక్కడమోనిత: అసలు తన ఊసే వద్దంటే తన ఇల్లు సంగతెందుకుకార్తీక్: తన భర్తతో మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేద్దాం..తన భర్తతో ఉన్నసమస్య సాల్వ్ చేస్తే నా చుట్టూ తిరగడం మానేస్తుంది కదామోనిత: వంటలక్క నుంచి దూరంగా తీసుకొస్తే అదే టాపిక్ మాట్లాడుతున్నాడు..ఏం చేయాలిరా దేవుడా. అప్పుడే దీపని చూసిన మోనిత టెన్షన్ పడుతుంది..దీప కూడా అప్పుడే కార్తీక్ ని చూసి డాక్టర్ బాబు అని పిలుస్తుంది...దీప: మీరిక్కడున్నారా ఎక్కడెక్కడో వెతుకుతున్నాను..కార్తీక్: మీ ఇల్లెక్కడ ఓసారి తీసుకెళ్లు..మీ ఆయనతో మాట్లాడాలిరండి తీసుకెళతానని దీప అనడంతో..మోనిత ఫైర్ అవుతుంది..దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది.. వెంటనే మోనిత ఏర్పాటు చేసిన వారు ఎంట్రీ ఇచ్చి దీపను టార్గెట్ చేస్తారు... ఎందుకు వాళ్ల జీవితంతో ఆడుకుంటావ్ మళ్లీ కార్తీక్ బాబుతో కనిపిస్తే నీకు వేరేలా బుద్ధి చెప్పాల్సి వస్తుందంటారు... నా మూడేం బాలేదు నువ్వెళ్లు అనేసి వెళ్లిపోతాడు కార్తీక్...

Also Read: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

సోమవారం ఎపిసోడ్ లోబతుకమ్మ ఆడుతుంటారంతా.. నీకు రాజ్యలక్ష్మికి ఏంటి సంబంధం అని మోనిత అడుగుతుంది..నీ నాటకం బయటపడడం ఖాయం అంటుంది దీప... కార్తీక్ ని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తానంటుంది.